Singer P.Susheela Biopic: ఇటీవల కాలంలో బయోపిక్ సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది గొప్ప నటీనటులు, రాజకీయ నాయకులు, క్రీడారంగానికి చెందిన ప్రముఖుల బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ సినీ సంగీతంలో చెరగని ముద్ర సొంతం చేసుకున్న ప్రముఖ లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్(M.S.Subbalakshmi) సినిమాని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఇలా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమా ప్రకటించిన అనంతరం మరో లెజెండరీ సింగర్ బయోపిక్ సినిమాకు సంబంధించిన వార్తలు తెరపైకి వచ్చాయి. భారతీయ సినీ సంగీతంలో తరాలు మారిన చెక్కుచెదరని అద్భుతమైన గానంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సింగర్ సుశీలమ్మ(P.Susheela) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వేలాది పాటలతో ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకున్న సుశీలమ్మ బయోపిక్ సినిమాని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీలో వార్తలు బయటకు వచ్చాయి. మరి నిజంగానే సుశీలమ్మ బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందా అనే విషయానికి వస్తే..
సుశీలమ్మ బయోపిక్ సినిమా వెనుక ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ (A.R.Rahman)పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఏఆర్ రెహమాన్ నిర్మాణ సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి. సంగీతంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెహమాన్ మరొక లెజెండరీ సింగర్ బయోపిక్ సినిమా చేయబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బయోపిక్ సినిమాలో ఎవరు కీలకపాత్ర పోషించబోతున్నారు అనే విషయానికి వస్తే..
సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సొతం చేసుకున్న వారిలో నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ఒకరు. కాంతారా 1 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పి సుశీలమ్మ బయోపిక్ సినిమాలో సుశీలమ్మగా కనిపించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. మరి సుశీలమ్మ బయోపిక్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఏఆర్ రెహమాన్ టీం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాని గౌతమ్ తిన్న నూరి దర్శకత్వం వహిస్తుండగా అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక మందన్న నటించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!