E-Paper
Advertisement

Rashmika mandanna: ఆ అభద్రత భావమే నన్ను ఈ స్థాయికి చేర్చింది..

Rashmika mandanna: ఆ అభద్రత భావమే నన్ను ఈ స్థాయికి చేర్చింది..
Advertisement

Rashmika mandanna:2025.. మరో మూడు రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు ఇస్తూ తమకు ఈ ఏడాది ఎలా గడిచింది అనే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మరి కొంతమంది తమ సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేస్తూనే.. సినీ కెరియర్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది..ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో అలాగే తాను ఈ స్థాయికి రావడం వెనుక అసలు కారణం.. ఇలా ప్రతి దానిపై స్పందించింది రష్మిక.

100% పని చేస్తాను..

రష్మిక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. “తెలుగు, కన్నడ, తమిళ్ , హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఏ ఒక్క పరిశ్రమను తేలికగా తీసుకోలేదు. ఒక సినిమాను అంగీకరించినప్పుడు 100% పని చేస్తాను. అంతేకాదు ఏ భాషలో సినిమా చేస్తే ఆ సినిమా పూర్తయ్యే వరకు అక్కడే ఉంటాను. ఈ ప్రయాణంలో దర్శక నిర్మాతల నుంచి ప్రతి విభాగం వరకు అద్భుతమైన బృందాలతో కలిసి పనిచేసే అవకాశం లభించడం నాకు పూర్తిగా దక్కిన అదృష్టం.

నన్ను నేను అన్వేషించాలనుకున్నాను..

Advertisement

నన్ను నేను కేవలం ఒక నటిగా మాత్రమే చూడాలనుకోలేదు. నాలోని విభిన్న వ్యక్తిత్వాలను, కోణాలను అన్వేషించాలనుకున్నాను. అందులో భాగంగానే నన్ను నేను నిరంతరం మెరుగుపరుచుకుంటూ.. ఎదుగుతూ ఉండే వ్యక్తిగా ప్రేక్షకులు గుర్తించాలని ఆశించాను. అందుకు తగ్గట్టుగానే దర్శకులకు, రచయితలకు.. వారు రాసిన కథ నచ్చితే, నమ్మకంగా అనిపిస్తే, నన్ను నేను ఆ చిత్రానికి అంకితం చేసుకొని వారికి లొంగిపోయాను అంటూ తెలిపింది. అలాగే తన బాల్యం గురించి మాట్లాడుతూ.. నటిగా నేను ఇప్పటివరకు నా ప్రయాణాన్ని కొనసాగించాను. అయితే ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూస్తే చాలా సంతోషంగా ఉంది.

అభద్రతాభావమే నన్ను ఈ స్థాయికి చేర్చింది..

కొన్ని అలవాట్లు, నమ్మకాల మధ్య పెరిగాను. బాల్యం నుంచి ఆందోళన, అభద్రతాభావం లాంటి ఎన్నో అంతర్గత పోరాటాలను నేను ఎదుర్కొన్నాను. అయితే వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. నెమ్మదిగా, స్థిరంగా పనిచేయడం నేర్చుకున్నాను. అంతేకాదు ఈరోజు నేను ఎవరినో చెప్పుకోగలుగుతున్నాను. ముఖ్యంగా నా జీవితంలో నేను ఎదుర్కొన్న అవాంతరాలన్నింటినీ ఇప్పుడు వెనక్కి నెట్టి ధైర్యంగా నా భుజం నేను తట్టుకుంటూ ఈ స్థాయికి వచ్చాను.. నిజానికి ఇలాంటి మార్పులు ఇతరులకు చిన్నవిగా అనిపించినా.. నేను మాత్రం నా జీవితంలో జరిగిన ప్రతి దాన్ని ఒక అద్భుతంగానే చూస్తాను” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. మొత్తానికి రష్మిక చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:Mahash Babu: వారణాసి కోసం మహేష్ కొత్త విద్య.. కలరియపట్టుతో ఇన్ని ప్రయోజనాలా?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×