E-Paper
Advertisement

Rashmika Mandanna: మరిది పుట్టినరోజు..మిస్ అవుతున్నాం అంటూ రష్మిక స్పెషల్ విషెస్!

Rashmika Mandanna: మరిది పుట్టినరోజు..మిస్ అవుతున్నాం అంటూ రష్మిక స్పెషల్ విషెస్!
Advertisement

Rashmika Mandanna:  రష్మిక పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ భార్యగా మారిపోయారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ విజయ్ రష్మిక పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి పూర్తి కావడంతో తిరిగి ఈ జంట తమ సినిమాల పనులలో ఎంతో బిజీ బిజీగా ఉన్నారు.

ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు ..

ఇకపోతే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలోనే అభిమానులు ఆయన స్నేహితులు సోషల్ మీడియా వేదిక ఆనంద్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక తన మరిది ఆనంద్ కు ఇంస్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనంద్ రష్మిక ఇద్దరూ రౌడీ బ్రాండ్ కు చెందిన ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించి ఒక నది పక్కన నిలబడి ఉన్న ఫోటోని షేర్ చేశారు.

చేపలను పిలుస్తున్నట్లుంది..

Advertisement

ఈ ఫోటోని షేర్ చేసిన రష్మిక ఆనంద్ దేవరకొండ హ్యాపీ బర్త్ డే ఆనంద్… ప్రస్తుతం నువ్వు సినిమా షూటింగ్లో ఉన్నావు మేము చాలా మిస్ అవుతున్నాము.. అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఈమె ఆనంద్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . అదే విధంగా ఈ ఫోటో గురించి కూడా రష్మిక మాట్లాడుతూ ఈ ఫోటో తీసినప్పుడు మనం చేపలను పిలుస్తున్నట్లు కనిపిస్తోందని విజ్జు చెప్పాడు . మనం ఎప్పుడు చేపలను ఇలాగే పిలుద్దాం అంటూ రష్మిక పోస్ట్ చేశారు అదేవిధంగా దేవరకొండతో కలిసి డాన్స్ చేస్తున్నటువంటి ఒక వీడియోని కూడా ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి తర్వాత ఆనంద్ దేవరకొండ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడం విశేషం.

వదిన ఎలా ఉన్నారు?

Advertisement

ఇక రష్మిక తన వదినగా వచ్చినందుకు ఆనంద్ దేవరకొండ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లిన ప్రతిసారి తన అభిమానులు వదిన ఎలా ఉంది అంటూ అడిగే వారు అప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు వదిన వచ్చేసింది అంటూ ఈయన రష్మిక గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఇప్పుడు వదిన మరిదికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో రష్మిక , ఆనంద్ దేవరకొండ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే రష్మిక కాక్ టైల్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రణబాలి అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Also Read: Balakrishna: దేవాన్ష్ ధోతి వేడుక..బాలయ్య ఆరోగ్యం విషయంలో ఫ్యాన్స్ ఆందోళన.. ఏమైందంటూ!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×