E-Paper
Advertisement

Air Cooler: కూలర్‌ను నీరు లేకుండా వాడొచ్చా? ఒకవేళ వాడితే ఏం జరుగుతుంది?

Air Cooler: కూలర్‌ను నీరు లేకుండా వాడొచ్చా? ఒకవేళ వాడితే ఏం జరుగుతుంది?
Advertisement

Air Cooler: సాధారణంగా ఎయిర్ కూలర్లలో నీరు తప్పనిసరి. మనం పోసే నీటిని వినియోగించుకొని అది చల్లటి గాలిని బయటకు ప్రసారం చేస్తాయి. అయితే నీరు పోయకుండా కూలర్ ను వినియోగిస్తే ఏమవుతుంది? అన్న ప్రశ్న చాలా మందిలో సహజంగానే ఉంటుంది. అలా చేస్తే పెద్ద పొరపాటు చేసిన వారమవుతామా? అని చాలా మంది అనుమానిస్తుంటారు. ప్రస్తుతం సమ్మర్ లో కూలర్ల వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో.. చాలా మందిలో ఉన్న ఈ సందేహాలను ఈ కథనంలో నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం.

నీరు లేకుండా వాడొచ్చా? లేదా?

ఎయిర్ కూలర్‌ను నీరు లేకుండా ఉపయోగించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నీరు లేనప్పుడు అది కేవలం ఒక సాధారణ ఫ్యాన్ వలె మాత్రమే పనిచేస్తుందని పేర్కొంటున్నారు. కూలర్‌లోని ‘పంప్’ స్విచ్ ఆపివేసి కేవలం ‘ఫ్యాన్’ మోడ్‌ను మాత్రమే ఆన్ చేస్తే సాధారణ సీలింగ్ ఫ్యాన్ తరహాలోనే గాలిని ఇస్తుందని తెలియజేస్తున్నారు.

నీరు లేకుండా ఎప్పుడు వాడితే బెటర్?

Advertisement

వర్షాకాలంలో లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూలర్‌లో నీరు పోస్తే గది మరింత ఉక్కపోతగా (Humid) మారుతుంది. అటువంటప్పుడు నీరు లేకుండా కేవలం ఫ్యాన్ లాగా వాడటం కూలర్ ను వాడటం మంచిది. అలాగే వాతావరణం మరీ వేడిగా లేనప్పుడు, సాధారణ గాలి వస్తే చాలు అనుకున్న సందర్భాల్లోనూ ఉపయోగించుకోవచ్చు. మరోవైపు కూలర్ ను కడిగిన తర్వాత లోపల ఉన్న ప్యాడ్ లు ఆరబెట్టడానికి కూడా కొద్దిసేపు నీరు లేకుండా ఫ్యాన్ ను ఆన్ చేసుకోవచ్చు.

Also Read: Godrej vs Whirlpool: తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. రెండింటిలో ఏది బెస్ట్!

నీరు లేకుండా వాడితే కలిగే నష్టాలు?

Advertisement

క్రమం తప్పకుండా నీరు లేకుండా కూలర్ వాడితే పంప్ మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ మోటార్.. నీటిని పంపింగ్ చేయడం ద్వారా చల్లబడుతుంది. నీరు లేకపోతే అది అతిగా వేడెక్కే ప్రమాదముంది. మరోవైపు కూలర్ లో నీరు పోయకపోతే మీకు ఏమాత్రం చల్లదనం రాదు. కేవలం వేడి గాలి మాత్రమే వస్తుంది. కూలర్ లోని హనీకాంబ్ లేదా గడ్డి ప్యాడ్‌లు ఎప్పుడూ తడిగా ఉంటేనే వాటి మన్నిక బాగుంటుంది. ఎప్పుడూ ఎండిపోయి ఉండటం వల్ల అవి త్వరగా విరిగిపోయే లేదా పొడిబారిపోయే అవకాశం ఉంది. కూలర్ లో నీరు ఉంటే గాలిలోని దమ్మును ప్యాడ్ లు ఫిల్టర్ చేస్తాయి. నీరు లేకపోతే ప్యాడ్‌లలో ఉన్న దుమ్ము నేరుగా గదిలోకి వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

Also Read: Haier vs Samsung Fridges: సమ్మర్ కోసం.. ఈ రెండు ఫ్రిడ్జ్‌లలో.. ఏది కొంటే బెటర్?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×