Prashant Kini: ఎస్.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, దాని తర్వాత ఇండియాలో నెలకొన్న పరిణామాలు చూశాక.. అతా ఆశ్చర్యపోతున్నారు. కచ్చితమైన అంచనాలతో ప్రశాంత్ కిని సంచలనం సృష్టిస్తున్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు జోస్యం చెప్పడం వేరు, కానీ.. ఏ ఆధారాలు లేనప్పుడే.. భవిష్యత్‌ని అంచనా వేయడం వేరు. సరిగ్గా.. ఇదే పాయింట్ దగ్గర ప్రశాంత్ పాపులర్ అయ్యారు.
ప్రశాంత్ కిని కేవలం సాధారణ జ్యోతిష్యుడు మాత్రమే కాదు. ప్రముఖ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజర్. మార్కెట్ అనలిస్ట్. గ్రహాల గమనాన్ని.. ఆర్థిక పరిణామాలతో, అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపెట్టి విశ్లేషించడంలో దిట్ట అనే పేరుంది. సోషల్ మీడియాలో అతని అంచనాలు చాలా వరకు అక్షరసత్యాలు కావడంతో.. చాలా మంది ఆయన్ని ఫాలో అవడం మొదలుపెట్టారు. అలా.. ప్రశాంత్ కిని ప్రిడిక్షన్స్‌లో.. చెప్పింది చెప్పినట్టుగా జరిగిన వాటిలో కొన్ని హైలైట్స్ ఉన్నాయ్. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తుందని.. 2024 నవంబర్‌లోనే చెప్పాడు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు వెళ్తాయని, అది ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని ముందే హెచ్చరించారు. అంతేకాదు.. ఇజ్రాయెల్.. ఇరాన్‌ని తుడిచిపెట్టేస్తుందని అంచనా వేశాడు. ఇప్పటికే ఇజ్రాయెల్.. ఇరాన్‌ని చాలావరకు డ్యామేజ్ చేసిందని లేటెస్ట్‌గా మరో ట్వీట్ కూడా వేశాడు. ఇక.. సప్లై చైన్ డిస్టర్బ్ అవడం వల్ల.. ఇండియా ఈ ఏడాది మార్చ్ తర్వాత ఇంధనం, న్యాచురల్ గ్యాస్ కొరత ఎదుర్కొంటుందని.. గతేడాది సెప్టెంబర్‌లోనే చెప్పాడు. ఇప్పటికే.. ఇండియాలో ఎల్‌పీజీ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయ్. మార్చ్ ముగిశాక.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించుకోవచ్చనే చర్చ జరుగుతోంది.
Also Read: Vijay Sethupathi: విక్రమ్ ఇంట్రడక్షన్ సీన్ పై భయపడ్డ విజయ్.. లోకేష్ ఏం చేశారంటే?
ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్థిక ఒడిదుడుకులు, గ్యాస్ కొరత, షేర్ మార్కెట్ పతనం, సప్లయ్ చైన్ డిస్టర్బెన్స్ గురించి.. ప్రశాంత్ గతేడాది మే నెలలోనే హెచ్చరించాడు. మార్చి 2026 ప్రపంచానికి ఒక పరీక్షా కాలం అన్న ఆయన మాటలు.. ఇప్పుడు నిజమవుతుండటంతో.. అంతా ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ క్రాష్ సింగపూర్ నుంచి మొదలై.. దుబాయ్ దాకా వస్తుందని కొన్ని నెలల ముందే అంచనా వేశాడు ప్రశాంత్. అక్కడ ఇన్వెస్ట్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలని గతేడాదే చెప్పారు. సింగపూర్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంచనా వేశాడు. పడుతుందన్నాడు. ఇప్పుడు.. యుద్ధం కారణంగా.. దుబాయ్ రియల్ ఎస్టేట్ దాదాపు 30 శాతం పడిపోయింది. 8 నెలల క్రితం.. స్టాక్ మార్కెట్ ఆల్-టైమ్ హైలో ఉన్నప్పుడు కూడా, ఒకానొక టైమ్‌లో భారీ కరెక్షన్ వస్తుందని ముందే చెప్పి ఇన్వెస్టర్లను అలర్ట్ చేశారు. 2026 మార్చ్‌లో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగడం ఖాయం అన్నాడు. యుద్ధం ఎఫెక్ట్‌తో.. ఇప్పుడు నిజంగానే స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయ్. తన ప్రిడిక్షన్ వంద శాతం నిజమైందని.. సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నాడు.
ఈ ఏడాది మొదట్లోనే.. ఏప్రిల్ తర్వాత నిరుద్యోగ యువతకు ఆహారం, నీటి కష్టాలు మొదలవుతాయని అంచనా వేశాడు ప్రశాంత్. చాలా దేశాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని చెప్పాడు. అంతేకాదు.. ప్రపంచంలోని చాలా ప్రాంతాలు హీట్ వేవ్స్ బారిన పడతాయన్నాడు. 2026లో తక్కువ వర్షపాతం నమోదవుతుందన్నాడు. అందుకు తగ్గట్లుగానే.. ఇప్పుడిప్పుడే నిరుద్యోగులకు ఫుడ్, వాటర్ కష్టాలు మొదలయ్యాయ్ అని క్లెయిమ్ చేస్తున్నాడు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హాస్టళ్లు, రెస్టారెంట్లు మూసివేయడం, మెనూని కుదించడం లాంటివి చూస్తున్నాం. చాలా మంది హోటళ్లలో పనిచేసేవాళ్లు కొంతకాలం పాటు ఉపాధి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో.. పొరుగు దేశం నేపాల్.. భారత్‌కు శత్రుదేశంగా మారుతుందని కూడా అంచనా వేశాడు ప్రశాంత్ కిని. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తుతాయని చెబుతున్నాడు. నేపాల్ సరిహద్దుల్లో భారీ ప్రమాదం పొంచి ఉందని.. భారత్ ఇప్పుడే అప్రమత్తపై.. బోర్డర్‌లో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించాడు. కాలాపానీ లిపులేఖ్ పాస్‌పై వివాదాలు వస్తాయని, భారత్ కైలాష్ మానసరోవర్‌కు నేరుగా యాక్సెస్ పొందడాన్ని నేపాల్ సహించదంటున్నాడు.
జరగబోయే పరిణామాలను ప్రశాంత్ కిని ఇంత పక్కాగా ఎలా అంచనా వేయగలుగుతున్నాడనేదే.. ఓ మిస్టరీ. ఇదంతా మ్యాజికల్‌గా జరుగుతోందనుకుంటున్నారు. కానీ.. ప్రశాంత్ చెప్పే దాని ప్రకారం.. ఇందులో శాస్త్రీయ కోణం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. కేవలం సెలబ్రిటీల జాతకాలు చూడటమే కాదు.. గ్రహాల స్థితిగతులు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎలా ప్రభావం చూపుతాయో విశ్లేషిస్తారు. జ్యోతిష్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తారు. ఈ డేటాని.. గ్రహాల మూమెంట్‌ని కలిపి.. ఓ ప్రిడిక్టివ్ మోడల్‌గా అంచనా వేస్తారు. కొన్ని హిస్టారికల్ ప్యాటర్న్స్ కూడా ఫాలో అవుతారు. గతంలో యుద్ధాలు జరిగినప్పుడు, మార్కెట్లు కుప్పకూలినప్పుడు.. గ్రహాలో స్థితి ఎలా ఉంది? అప్పుడెలాంటి పరిస్థితులు తలెత్తాయి? లాంటి వాటిపై రీసెర్చ్ చేసి, వాటిని ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూస్తారు. అలా.. హిస్టరీ రిపీట్ అవుతుందనే సిద్ధాంతాన్ని ప్రశాంత్ బలంగా నమ్మతారని అర్థమవుతోంది.
బేసిగ్గా.. జ్యోతిష్యులు చెప్పే విషయాలు అస్పష్టంగా ఉంటాయ్. చాలా మంది నమ్మరు. కానీ.. ప్రశాంత్ కిని.. ఫలానా నెలలో, ఫలానా వారంలో కచ్చితంగా మార్పులు వస్తాయని స్పష్టంగా చెబుతారు. తన ప్రిడిక్షన్‌లు తప్పయితే అంగీకరిస్తారు. నిజమైతే, వాటికి సంబంధించిన ఆధారాలను వెంటనే పోస్ట్ చేయడం చేస్తారు. అదే.. సోషల్ మీడియాలో పాపులారిటీకి కారణమైంది. అందుకే నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఇతని పేరు వినిపిస్తోంది. కేవలం.. గ్రహాల గతులను మాత్రమే కాదు, ఏకంగా దేశాధినేతల పతనాన్ని, ప్రముఖ నేతల మరణాలను కూడా నెలల ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాడు. బాబా వంగ, నోస్ట్రడామస్ లాంటి వాళ్లకు కూడా వంద శాతం స్ట్రయిక్ రేట్ ఉండదు. ఎక్కువ సక్సెస్ రేట్ జ్యోస్యాలు చెప్పేవారి పట్ల నమ్మకం, పాపులారిటీ కనిపిస్తాయ్. అలా.. ప్రశాంత్ స్ట్రయిక్ రేట్ చాలా ఎక్కువనే కామెంట్లు వినిపిస్తున్నాయ్.
ఏడాది క్రితమే తమిళనాడు హీరో విజయ్, హీరో త్రిష పరిణామాల గురించి చెప్పాడు. ఎంజీఆర్-జయలలిత కాంబోని.. వాళ్లు అంచనా వేస్తున్నారనీ, విజయ్ తన మొదటి భార్యను వదిలేస్తాడని కూడా అంచనా వేశాడు. విజయ్.. ఎంజీఆర్ మ్యాజిక్‌ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జయలలిత కోసం ఎంజీఆర్ తన భార్యని వదిలేశారని, విజయ్ కూడా తన భార్యకి దూరమవుతారని ఎప్పుడో చెప్పారు. సేమ్ మ్యాజిక్.. విజయ్, త్రిష కాంబో తమిళనాడు పాలిటిక్స్‌లో వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉందా? అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు కూడా.. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని అంచనా వేశారు. ఎవరూ ఊహించని పార్టీతో.. డీఎంకే అధికార పగ్గాలు చేపడుతుందంటున్నాడు. టీఎంకే సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాడు. విజయ్ పార్టీ.. ప్రభుత్వంలో చేరకపోయినా, బయటి నుంచి మద్దతిచ్చే అవకాశాలున్నాయని, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెబుతున్నాడు.
సెలబ్రిటీల విడాకులు, పొలిటికల్ విక్టరీలపై జోస్యం, కాంట్రవర్శీ కామెంట్లు లాంటి వాటితో.. ప్రశాంత్ కిని బోల్డ్‌గా చెప్పేస్తుంటాడు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచ పరిణామాలను విశ్లేషిస్తాడు. ఇతని.. ఫేమస్ ప్రిడిక్షన్ ఏమిటంటే.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం. ప్రశాంత్ అంచనాకు ఇది పరాకాష్ట అనే చెప్పాలి. ఇతని పేరు రీసౌండ్‌లో వినిపించడానికి.. అజిత్ పవార్ విషయంలో ఆయన చేసిన ముందస్తు హెచ్చరికే కారణం. 2024 చివరిలో, 2025 ప్రారంభంలోనే.. అజిత్ పవార్ జాతకంలో తీవ్రమైన గండం ఉందని, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరించారు. సరిగ్గా.. ఈ ఏడాది జనవరి చివరి వారంలో.. ముంబై సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ కన్నుమూశారు. మహారాష్ట్ర రాజకీయ అగ్రనేత విషయంలో.. దాదాపు ఏడాది ముందే గండం ఉందని చెప్పడం, అది నిజం కావడంతో.. ప్రశాంత్ కినిని.. సరికొత్త వంగ బాబాలా చూస్తున్నారు.
ఇక.. సంజూ శాంసన్ కెరీర్ టర్నింగ్ పాయింట్‌పైనా ముందే అంచనా వేశాడు. అతనిపైనా.. గతంలోనే ఇంట్రస్టింగ్ పోస్ట్ వేశాడు. 2024 మధ్యలో సంజూ శాంసన్ టీమిండియాలో సెట్ అవడం కష్టమని చాలా మంది భావిస్తున్న తరుణంలో.. ప్రశాంత్ అతని జాతకంలో గోల్డెన్ పీరియడ్ మొదలవుతుందని చెప్పాడు. 2025 వరకు ఓకే.. తర్వాత 2027 వరకు సూపర్‌గా ఉంటుందన్నాడు. మైదానంలో చెలరేగిపోతాడని చెప్పాడు. అంతేకాదు.. ఇండియాకు 2031 దాకా ఆడతాడని అంటున్నాడు. రిజల్ట్ చూస్తే.. సంజూ ఇప్పుడు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో, ఐపీఎల్ కెప్టెన్సీలో, టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతాలు చేసి చూపించాడు. తన కెరీర్‌లోనే.. బెస్ట్ ఫామ్‌లోకి వస్తాడన్న ప్రశాంత్ అంచనాలని నిజం చేశాడు.
అంతేకాదు.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం గురించి కూడా 8 నెలల ముందే చెప్పాడు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ లాంటి అంతర్జాతీయ అంశాలని కూడా ముందే ఊహించాడు. జ్యోతిష్యాన్ని బలంగా నమ్మేవాళ్లందరికీ ఇదో అద్భుతంలా కనిపిస్తుంది. నమ్మని వాళ్లకు.. ఇదంతా కాకతాళీయంగా అనిపిస్తుంది. కానీ, అజిత్ పవార్ మరణ లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత పరిణామాలను ముందే ఊహించి.. ఇండియాలో పరిస్థితులు ఎలా మారతాయో అంచనా వేసినప్పుడు మాత్రం.. జోస్యం వెనుక ఏదో శక్తి ఉందనే భావన చాలా మందిలో కలుగుతుంది. ఈ డిజిటల్ ఆస్ట్రాలజర్.. మున్ముందుకు ఇంకెన్ని సంచలన అంచనాలతో.. సెన్సేషన్‌గా మారతారన్నదే.. ఇంట్రస్టింగ్‌గా మారింది.
Story by: Anup, Big Tv
Also Read: Vijay Sethupathi: మహారాజా సీక్వెల్ పై విజయ్ క్లారిటీ.. మాస్ అభిమానులకు మంచి ఫీస్ట్!