E-Paper
Advertisement

Rashmika Mandanna: పెళ్లి పై రష్మిక ఎమోషనల్ పోస్ట్… అప్పుడే నెల అయ్యిందంటూ..

Rashmika Mandanna: పెళ్లి పై రష్మిక ఎమోషనల్ పోస్ట్… అప్పుడే నెల అయ్యిందంటూ..
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం జరిగి సరిగ్గా నేటికీ ఒక నెల పూర్తి కావడంతో రష్మిక సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లయి నెలరోజులు అయిందంటే నమ్మలేకపోతున్నా…

రష్మిక తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. అప్పుడే పెళ్లి జరిగి నెలరోజులు గడిచిపోయింది అంటే నమ్మలేకపోతున్నాను. పెళ్లి అనేది ఎప్పుడో జరిగే దూరపు ఆలోచన అనిపించేది. కానీ ఇప్పుడు మేము పెళ్లి చేసుకొని నెల రోజులు పూర్తి అయింది. ఇది నమ్మశక్యం కాలేదు, ఇది శాశ్వతమైన ప్రేమ అంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రష్మిక మందన్న విజయ్ దేవరకొండ వివాహం జరుపుకొని పలు ఆలయాలను సందర్శిస్తూ నెల మొత్తం పెళ్లి హడావిడిలో బిజీగానే ఉన్నారు.

థాయిలాండ్ లో బడ్డీ మూన్..

Advertisement

రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి సందర్భంగా వీరి పెళ్లి ఫోటోలు పై ఎంతో మంది అభిమానులు ప్రేమ కురిపించడంతో ఈ జంట ఆ ప్రేమకు కృతజ్ఞతగా దేశవ్యాప్తంగా పలు ఆలయాలలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. స్వీట్లను కూడా పంపిణీ చేశారు. అనంతరం పలు ఆలయాలను సందర్శిస్తూ హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేశారు. ఇక ఈ దంపతులు తమ హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా తన ఫ్రెండ్స్ తో పాటు వెకేషన్ వెళ్లిన కొత్తజంట ఈ వెకేషన్ హనీమూన్ కాకుండా బడ్డీ మూన్ గా జరుపుకున్నారు. ప్రస్తుతం వీరి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇకపోతే పెళ్లయిన తర్వాత ఈ జంట మొదటిసారి అనంతపురం జిల్లాలో పర్యటన చేశారు. ఇలా మొదటిసారి విజయ్ దేవరకొండ జంటగా అనంతపురం జిల్లాకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున వీరికి స్వాగతం పలికారు. విజయ్ దేవరకొండ రష్మిక రాకతో అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక కొత్తజంట అనంతపురంలోని పలు ఆలయాలలో సందర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక విజయ్ దేవరకొండకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పాలి. ఈయన చదువులు మొత్తం పుట్టపర్తి లోనే పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తరచూ పుట్టపర్తిని సందర్శిస్తూ ఉంటారు ఇక మొదటిసారి తన భార్యతో కలిసి అనంతపురం రావడంతో అభిమానులు కూడా సాదర స్వాగతం పలికారు.

Also Read: Anil Ravipudi: సంక్రాంతి జోడిలు ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి.. ఫ్లాప్ హీరోయిన్ తో సాహసం చేస్తున్నారా?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×