E-Paper
Advertisement

PSL 2026: ప్రేక్ష‌కులు లేక‌ ప‌దుల సంఖ్య‌లో బంతులు మిస్సింగ్..PSLలో అంపైర్ల క‌ష్టాలు చూడండి

PSL 2026: ప్రేక్ష‌కులు లేక‌ ప‌దుల సంఖ్య‌లో బంతులు మిస్సింగ్..PSLలో అంపైర్ల క‌ష్టాలు చూడండి
Advertisement

PSL 2026:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాహోర్ లోని గడాఫీ స్టేడియం (Gaddafi Stadium, Lahore) వేదికగా తొలి మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్లు ( Lahore Qalandars vs Hyderabad Kingsmen) తలపడుతున్నాయి. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ప్రేక్షకులు లేకుండానే జరుగుతోంది. దీంతో అభిమానులు లేకపోవడంతో ఈ తొలి మ్యాచ్ జరిగే గడాఫీ స్టేడియం బోసిపోయింది. అంతేకాదు ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో బంతులు అన్నీ మాయమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిక్సర్ వెళ్తే బంతిని వెతికే నాథుడే లేడు. ఈ కారణంగా పదుల సంఖ్యలో బంతులు మిస్ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

ప్రేక్ష‌కులు లేక‌ ప‌దుల సంఖ్య‌లో బంతులు మిస్సింగ్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ గురువారం షురూ అయింది. అయితే ఈ మెగా టోర్నమెంట్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రేక్షకులు లేకుండానే లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్ల ( Lahore Qalandars vs Hyderabad Kingsmen) మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ప్రేక్షకులు లేకపోవడంతో లాహోర్ స్టేడియం మొత్తం బోసిపోయింది. లైవ్ మ్యాచ్ చూస్తుంటే, ఏదో కోల్పోయినట్లుగానే సాటి ప్రేక్షకులకు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మరో ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కింగ్స్ మెన్ మొదట బ్యాటింగ్ చేసింది.

అయితే వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో దాదాపు 8 బంతులు మిస్సింగ్ అయినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొదటి 15 ఓవర్లలోనే మూడు బంతులు మిస్ అయ్యాయి. ఆ త‌ర్వాత మ‌రిన్ని సిక్స‌ర్లు వెళ్ల‌డంతో బంతులు దొర‌క‌లేద‌ని అంటున్నారు. దీంతో కొత్త బంతులను వెంట వెంటనే అంపైర్లు తీసుకువచ్చారు. అయితే దీని అంతటికి కారణం ప్రేక్షకులు లేకపోవడం. ప్రేక్షకులు ఉండి ఉంటే, సిక్సర్ వెళ్లిన బంతిని వెంటనే వాళ్లు స్టేడియంలోకి తిరిగి వేస్తారు. కానీ ఇప్పుడు ఖాళీ కుర్చీలు ఉన్న నేపథ్యంలో, బంతులు దొరకడం లేదు. ఆ బంతులు వెతకడం కోసం అంపైర్లే రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితి చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. క్రికెట్ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని దారుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

 

 

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×