Rashmika Mandanna: పరశురాం రచన దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై 2018లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం గీత గోవిందం . ఈ సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) జంట అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అభిమానుల హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత విజయ్, రష్మిక మందన్న జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఇక అలా వీరిద్దరూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మరుసటి ఏడాది ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో మరోసారి సందడి చేశారు. ఈ రెండు సినిమాల సమయంలోనే వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని డేటింగ్ కూడా చేసుకున్నారనే వార్తలు వినిపించాయి.
ఇక దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా తమ ప్రేమను బహిర్గతం చేయకుండా మెయింటైన్ చేసిన ఈ జంట ఎట్టకేలకు గత నాలుగు రోజుల క్రితం అభిమానులు తమ జంటకు ముద్దుగా పెట్టిన “విరోష్” అనే పేరును సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అంటూ” ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ ” అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా అధికారికంగా ప్రకటించేశారు. ఇక ఎట్టకేలకు ఈరోజు మూడు ముళ్ళు ఏడడుగులతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఉదయం 10:10 సమయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకటయ్యారు. అలాగే సాయంత్రం 4:30 గంటలకు రష్మిక మందన్న కుటుంబ సాంప్రదాయ ఆచారాల ప్రకారం కొడవ పద్ధతిలో రెండవసారి వివాహం చేసుకోబోతున్నారు. ఇక అలా ఒకే రోజులోనే రెండు మత సాంప్రదాయాల ప్రకారం వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు.
also read:Actress Udaya Bhanu: సుమాపై అనుచిత వ్యాఖ్యలు.. అసలు విషయం బయటపెట్టిన ఉదయభాను!
ఇకపోతే విజయ్ తో వివాహం జరిగిన సందర్భంగా రష్మికకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఆమె తన మాతృభాష అయిన కొడవ భాషలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆ వీడియోలో రష్మిక మందన్న తన మాతృభాషలో.. “నేను నా స్నేహితురాలి పెళ్లి కోసం మంగళూరుకి వచ్చాను. నిరంతరం నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న నా ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా నేను ఇంకా కష్టపడి పని చేస్తాను. మంచి సినిమాలు చేసి పేరు నిలబెడతానని హామీ ఇస్తున్నాను. నన్ను ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మీరంతా ఎప్పుడూ నా మనసులో ఉంటారని చెబుతూ” తన అభిప్రాయాలను తన మాతృభాషలో వీడియో రిలీజ్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
కొడవ భాషలో మాట్లాడుతూ కనిపించిన రష్మిక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది#VijayDeverakonda #RashmikaMandanna #ViRoshWedding #KodavaTradition pic.twitter.com/8eYef9UEoI
— BIG TV Cinema (@BigtvCinema) February 26, 2026