E-Paper
Advertisement

Rashmika Mandanna: పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ సినిమా.. ఏకంగా అలాంటి క్యారెక్టర్ లో కనిపించనున్న నటి ..రిలీజ్ డేట్ ఇదే..!

Rashmika Mandanna: పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ సినిమా.. ఏకంగా అలాంటి క్యారెక్టర్ లో కనిపించనున్న నటి ..రిలీజ్ డేట్ ఇదే..!
Advertisement

Rashmika Mandanna:నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత నెల పెళ్లి చేసుకున్న రష్మిక.. ఇప్పుడు తన కొత్త సినిమా కాక్టెయిల్ 2తో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ సినిమా గురించి తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘కాక్టెయిల్ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు హోమీ అదజానియా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

Advertisement

ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, ప్రముఖ నటి కృతి సనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రష్మిక తన సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా పోస్టర్లను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ మార్చి 18న విడుదల అవుతుందని ఆమె ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ఏకంగా రష్మిక మరో అమ్మాయిని ప్రేమించే పాత్రలో కనిపించనుంది.

పోస్టర్లో చాలా స్టైలిష్ గా కనిపించిన హీరోయిన్..!

పోస్టర్‌లో రష్మిక చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. కారులో నిలబడి ఆనందంగా ప్రయాణం చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. జనవరి నెలలోనే చిత్రబృందం షూటింగ్‌ను ముగించుకుంది. ఆ సమయంలో దర్శకుడు హోమీ అదజానియా షూటింగ్ పూర్తైన సందర్భంగా టీమ్‌తో కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2012లో వచ్చిన ‘కాక్టెయిల్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకొనే, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ఈ కొత్త చిత్రం వస్తోంది.

ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..ఇటీవల రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ పెళ్లి జరిగిన తర్వాత హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కు ఈ సినిమా టీమ్ సభ్యులను కూడా ఆమె ఆహ్వానించింది. ఆ కార్యక్రమానికి కృతి సనన్, దర్శకుడు హోమీ అదజానియా, నిర్మాత దినేష్ విజన్ మరియు ఇతరులు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా, షాహిద్ కపూర్.. కృతి సనన్ ఈ సినిమాతో మరోసారి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకుముందు 2024లో వచ్చిన ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా’ సినిమాలో కలిసి కనిపించారు. జూన్ 19, 2026న విడుదల కానున్న ‘కాక్టెయిల్ 2’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ALSO READ: Arjun Das: ఓజి నటుడికి లవ్ బ్రేకప్..సంచలనంగా మారిన పోస్ట్!

Related News

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

Big Stories

Advertisement
×