E-Paper
Advertisement

immense wealth: ఆ దిశకు తల ఉంచి నిద్రిస్తే అఖండ ధనయోగం పడుతుందట

immense wealth: ఆ దిశకు తల ఉంచి నిద్రిస్తే అఖండ ధనయోగం పడుతుందట
Advertisement

immense wealth: ఇంట్లో పడుకునే ముందు ఏ దిశకు పడుకుంటున్నామో అనేది కూడా చాలా ముఖ్యమట. ఒక దిశకు తల ఉంచి  పడుకుంటే అఖండ ధనయోగం కలుగుతుందట. అలాగే ఇంకో దిశకు తల ఉంచి నిద్రించడం అంత మంచిది కాదట. అయితే ఏ దిశకు తల ఉంచి నిద్రిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

తూర్పు దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరైనా తమ బెడ్‌ రూంలో కానీ ఇంట్లో కానీ తూర్పు దిశకు తల ఉంచి నిద్రిస్తే చాలా మంచిదట. అలా నిద్రించడం వల్ల వారికి సుఖం, సంతోషం పెరుగుతాయట. కుటుంబంలో అన్యోన్యత పెరిగి హ్యాపీగా ఉంటారట.

Advertisement

ఉత్తర దిశ: ఎవరైనా ఇంట్లో ఉత్తర దిక్కుకు తల ఉంచి నిద్రిస్తే వారికి అది మంచిది కాదట. నెగెటివ్‌ ఎనర్జీ పెరిగిపోతుందట. ఇంట్లో సంతోషం లేకుండా పోతుందట. ఆ ఇంటి సభ్యులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందట. ఇంకా చెప్పాలంటే అకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయట.

పడమర దిశ: వాస్తుశాస్త్రం మరియు పురాణాల ప్రకారం పడమర దిశకు (పడమర ముఖంగా) తల పెట్టి నిద్రించడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల  నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందట. ఇంకా  మానసిక ఆందోళనలు, కలతలు, కోపం పెరగడం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.

Advertisement

దక్షిణ దిక్కు:  దక్షిణ దిక్కుకు తల ఉంచి నిద్రిస్తే వాస్తు ప్రకారం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. నిద్రించడానికి అత్యుతమమైన దిశ ఇదేనని పండితులు సూచిస్తుంటారు.  దక్షిణ దిశ వైపు నిద్రించడం వల్ల భూమి యొక్క అయస్కాంత శక్తితో శరీరం సమలేఖనమవుతుందట ఇంకా గాఢమైన నిద్ర కూడా పోతారట. మానసిక ప్రశాంతత లభిస్తుందట. అలాగే  మంచి ఆరోగ్యం, కీర్తి, మరియు దీర్ఘాయుష్షు లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

ఆగ్నేయ దిశ: వాస్తుశాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశకు తల ఉంచి నిద్రిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయట. అలాగే అనవసరంగా  అప్పులు పెరిగే చాన్స్‌ ఉందట. ఈ దిశ అగ్ని మూలకం, కాబట్టి ఇక్కడ నిద్రించడం అంత మంచిది కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. కాదు కూడదని తలదూర్చి పడుకుంటే మానసికమైన అశాంతి కలుగుతుందని చెప్తున్నారు పండితులు.

నైరుతి దిశ: వాస్తు ప్రకారం నైరుతి (South-West) దిశలో తల ఉంచి నిద్రించడం అత్యంత శ్రేష్ఠమైనదిగా చెప్తున్నారు పండితులు. అలాగే ఈ దిశలో తల ఉండి పడుకుంటే.. ఎంతో శుభప్రదమట. ఇది నిద్రలో స్థిరత్వం, శారీరక శక్తి, మానసిక ప్రశాంతత, దీర్ఘాయువు మరియు సంపదను ఆకర్షిస్తుందని సూచిస్తున్నారు పండితులు. మరీ ముఖ్యంగా కుటుంబ యజమాని ఆరోగ్యానికి, ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వాయవ్యం దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం వాయువ్యం (North-West) దిశలో తల ఉంచి నిద్రించడం ఆరోగ్యపరంగా అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిక్కు తల ఉంచి నిద్రిస్తే.. నిద్రలేమి, అధిక ఆలోచనలతో బాధపడతారట. అలాగే  మానసిక అశాంతి ఎక్కువగా కలుగుతుందట. వాయువ్యం అనేది  స్థిరత్వం లేని దిశ కాబట్టి ఇక్కడ పడుకుంటే నిద్ర సరిగ్గా పట్టక, తరచుగా మెలకువలు రావడం లేదా పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

ఈశాన్యం దిశ: వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యం (North-East) దిశలో తల ఉంచి నిద్రించడం అస్సలు మంచిది కాదట. ఈ దిశలో తల పెట్టి పడుకోవడం వల్ల మానసిక ఆందోళనలు, నిద్రలేమి, అనారోగ్య సమస్యలు మరియు కుటుంబంలో అనవసరమైన కలహాలు, ఆర్థిక రుణాలు పెరిగే అవకాశం ఏర్పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గుమ్మానికి బూడిద గుమ్మడికాయ ఇలా కడితే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలకు లోటుండదట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×