Vijay -Rashmika:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు రూమర్ద్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna)ఎట్టకేలకు రెండు రోజుల క్రితం తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక అలాగే మార్చి 4వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ హోటల్ లో రష్మిక , విజయ్ దేవరకొండ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి విజయ్ దేవరకొండ వెడ్డింగ్ కార్డ్స్ అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక , విజయ్ దేవరకొండ ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరి ఆస్తులు కలిపి ఎంత అనే విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన్న , ఈ ఏడాది ప్రారంభానికి రూ.60 నుండి 80 కోట్ల మేరా ఆస్తులు కూడబెట్టిందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు 4 నుండి 8 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈమె.. పుష్ప వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.. ఇక సినిమాలకు మించి బ్రాండ్ ఎండార్స్మెంట్, సోషల్ మీడియా ప్రమోషన్స్ , ప్రైవేట్ కార్యక్రమాల ద్వారా భారీగా సంపాదిస్తోంది. ముఖ్యంగా స్వరోవ్స్కీ, బోట్, కళ్యాణ్ జువెలర్స్, 7అప్, మీ షో వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్గా పనిచేస్తుంది. పైగా వీగన్ బ్యూటీ బ్రాండ్ ప్లమ్ లో పెట్టబడులు కూడా పెడుతోంది.
ముంబై , బెంగళూరు, కూర్గ్, హైదరాబాద్, గోవా వంటి ఖరీదైన నగరాలలో లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి. బెంగళూరులో ఉండే బంగ్లా విలువ రూ.8 కోట్లు. ఈమె దగ్గర ఉన్న కార్ల విషయానికొస్తే.. ఆడి క్యూ 3, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ , టయోటా, ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన ఈయన నికర విలువ 60 – 70 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 నుండి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈయనకు జూబ్లీహిల్స్ లో 15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది.. రౌడీ వేర్ బ్రాండ్, ఈ – కామర్స్, పాప్ అప్ వెంచర్ల ద్వారా సంవత్సరానికి 8 కోట్ల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు.
అలాగే ఎండార్స్మెంట్ డీల్ కి కోటి నుండి 2 కోట్ల వరకు తీసుకుంటున్న ఈయన స్పాన్సర్స్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి 40 లక్షల వరకు సంపాదిస్తున్నారు.. . విజయ్ దగ్గర ఉండే కార్ల విషయానికి వస్తే ఓల్వో ఎక్స్ సి 90, ఫోర్డ్ మస్టాంగ్ , రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహ యజమాని.. ఫ్రాంచైజీలో భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు. రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా ఉన్నాయి. అంతేకాదు విజయ్ దగ్గర 30 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జట్టు ఉన్నట్లు సమాచారం.
ఇకపోతే విజయ్ – రష్మిక మొత్తం నికర ఆస్తులు విలువను ఒకసారి గమనించినట్లయితే.. ఇంచుమించు 140 కోట్ల రూపాయల సంపదను కలిగి ఉన్నారని సమాచారం. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో జంటగా పనిచేసిన ఈ జంట.. ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమాలో కూడా జంటగా నటిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఇద్దరి సంపాదన చూసి టాలీవుడ్ రిచెస్ట్ జాబితాలో ఒకరిగా వీరు స్థానం సంపాదించుకున్నారు అని చెప్పవచ్చు.
ALSO READ:Rashmika vs Vijay: రష్మిక – విజయ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్.. ఎవరు తోపో తెలుసా?