E-Paper
Advertisement

Ranveer Singh: కాంతారా వివాదం…రణవీర్ సింగ్ కు ఊరట… చర్యలు వద్దన్న కోర్టు..

Ranveer Singh: కాంతారా వివాదం…రణవీర్ సింగ్ కు ఊరట… చర్యలు వద్దన్న కోర్టు..
Advertisement

Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఇటీవల కాలంలో వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే .ముఖ్యంగా ఈయన కాంతారా సినిమాలోని దైవ నర్తనను అనుకరించడంతో ఇది కాస్త వివాదంగా మారింది. రణవీర్ సింగ్ ఇలా అవార్డు వేడుకలో భాగంగా కాంతార సినిమాని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ దైవ నర్తనను ఇమిటేట్ చేయడంతో కచ్చితంగా ఇది కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించినట్లేనని కన్నడిగులు హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh)చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రణవీర్ సింగ్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఈయన కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి.

రణవీర్ సింగ్ పై చర్యలు వద్దు..

గత కొద్దిరోజులుగా రణవీర్ సింగ్ కు సంబంధించి ఈ వివాదం కర్ణాటక హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది అయితే తాజాగా ఈ విషయంపై కర్ణాటక హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇరు పక్షాల వాదనను విన్న అనంతరం కోర్ట్ తన తీర్పును ప్రకటిస్తూ.. ఈ విషయంలో రణవీర్ సింగ్ సహకరించాలి అంటూ ఆయనకు ఆంక్షలు విధిస్తూనే మరోవైపు సదరు హీరో పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు…

Advertisement

ఓవర్గానికి చెందిన మతపరమైన మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. అజ్ఞానంతో ఇలాంటివి చేసినప్పటికీ ఇటువంటి చర్యలు సరికాదు అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను మార్చి రెండవ తేదీకి వాయిదా వేసింది. ఇలా ఈ కేసు విషయంలో హీరో పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈయనకు ఊరట లభించిందనే చెప్పాలి. ఈ వివాదం పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో హీరో రణవీర్ సింగ్ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు.

కాంతారా సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు..

Advertisement

గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో భాగంగా రణవీర్ సింగ్ కాంతార సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాపై, హీరో రిషబ్ శెట్టి పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూనే ఈ సినిమాలో ఓఓఓ.. అనే శబ్దాన్ని అనుకరించడంతో వివాదం నెలకొంది. ఈ వివాదం అనంతరం హీరో పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడటమే కాకుండా తనపై కేసును కూడా నమోదు చేశారు. రణవీర్ సింగ్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల దురంధర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణవీర్ మార్చి 19వ తేదీ ధురంధర్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను ఏర్పడ్డాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

Also read: Jr.NTR -Prashanth Neel: ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాలో మరో స్టార్ క్యామియో.. హీరో కూడా ఫిక్స్?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×