Rashmika vs Vijay:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని.. ఇప్పుడు నిజజీవితంలో జంటగా మారబోతున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉదయపూర్ లో వీరి వివాహం జరగనుంది. ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” ప్రతిచోట ట్రెండింగ్ లో నిలిచింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇద్దరి విద్యార్హత ఏమిటి? ఇద్దరిలో ఎవరు తోపు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
రష్మిక మందన్న తన స్కూల్ విద్యను కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈమె సైకాలజీ, జర్నలిజం , ఇంగ్లీష్ లిటరేచర్ అనే మూడు సబ్జెక్టులలో డిగ్రీని కలిగి ఉండడం గమనార్హం.
విజయ్ దేవరకొండ విద్యార్హతల విషయానికొస్తే.. ఈయన కూడా గ్రాడ్యుయేట్.. పుట్టపర్తిలోని సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన విజయ్ దేవరకొండ.. హైదరాబాదులోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో చేరి బీకాం డిగ్రీని పూర్తి చేశారు.
ఇకపోతే విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఇద్దరు కూడా గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ ఇద్దరి డిగ్రీలను పరిశీలిస్తే మాత్రం రష్మిక విజయ్ కంటే చదువులో ముందంజలో ఉంది అని చెప్పాలి. విజయ్ బీకాం డిగ్రీని మాత్రమే కలిగి ఉండగా.. రష్మిక మాత్రం మనస్తత్వశాస్త్రం, జర్నలిజం ,ఆంగ్ల సాహిత్యం అనే మూడు విషయాలను ఆమె కవర్ చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం విజయ్ కంటే రష్మిక చదువులో ముందంజలో ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
2018లో వచ్చిన గీతాగోవిందం సినిమాతో స్క్రీన్ స్పేస్ పంచుకున్న ఈ ఇద్దరు.. అప్పటి నుంచే ప్రేమలో పడ్డారు. పైగా 2023 నుండి ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు అక్కడక్కడ హింట్ ఇస్తూ వచ్చారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు. గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు ఎనిమిదేళ్ల ప్రేమాయణానికి స్వస్తి పలుకుతూ ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
also read:Mahesh Babu Vs Rajamouli: కొట్టుకుంటున్న మహేశ్ – రాజమౌళి.. కౌంటర్ ఇచ్చిన ఆర్జీవి!
గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ రచనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11 2026న విడుదల కాబోతోంది.