E-Paper
Advertisement

Rashmika Mandanna: అల్లు అర్జున్ సినిమాతో బిజీగా రష్మిక… పెళ్లి వార్తల్లో నిజమెంత..?

Rashmika Mandanna: అల్లు అర్జున్ సినిమాతో బిజీగా రష్మిక… పెళ్లి వార్తల్లో నిజమెంత..?
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్నా పేరు మరోసారి బాగా వైరల్ అవుతోంది. ఆమె సినిమా లైఫ్ అలానే పర్సనల్ లైఫ్ రెండు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త సినిమా షూటింగ్‌తో పాటు పెళ్లి వార్తలు కూడా ఒకేసారి వినిపించడమే.. ఈ రూమర్స్ కి కారణమయ్యాయి.

అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాను తాత్కాలికంగా AA22xA6 అని పిలుస్తున్నారు. ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా, షూటింగ్ మాత్రం సైలెంట్‌గా జరుగుతోందని టాక్.

Advertisement

తాజా సమాచారం ప్రకారం..రష్మిక మంగళవారం ముంబైలో ఈ సినిమా సెట్స్‌లో చేరిందట. ఆమె ఫిబ్రవరి మధ్య వరకు షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక, ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండతో ఆమె పెళ్లి జరగబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి రాజస్థాన్‌లో జరిగే అవకాశముందని కథనాలు చెబుతున్నాయి.

ప్రస్తుత షెడ్యూల్‌లో రష్మిక, అల్లు అర్జున్‌తో పాటు జాన్వీ కపూర్, జిమ్ సర్బ్‌లతో కలిసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోందట. ఈ భాగం మొత్తం ఇండోర్ షూట్‌గా, దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం. ముఖ్యంగా యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు.

Advertisement

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ – రష్మిక జోడీ మళ్లీ కలిసి కనిపించబోతుండటంతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈసారి రష్మిక పాత్ర పూర్తిగా భిన్నంగా, నెగటివ్ షేడ్‌లో ఉంటుందనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమా ఒక ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీగా చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో కనిపించనున్నాడట. హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాయన్న వార్తలు ఉన్నాయి.

ఈ చిత్రంలో రష్మిక, అల్లు అర్జున్‌తో పాటు దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రమ్యకృష్ణ, యోగి బాబు వంటి నటీనటులు కూడా నటిస్తున్నారు. 2025 జూన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది రెండో భాగంలో పూర్తయ్యే అవకాశముంది. 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రతి అప్డేట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

ALSO READ: Abhishek Sharma: స్టేడియంలోనే అభిషేక్ శ‌ర్మ‌కు ప్ర‌పోజ్‌..ముద్దుల వ‌ర్షం కురిపించిన లేడీ..ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×