E-Paper
Advertisement

Korean Lover Game: సారీ నాన్నా.. ఆన్ లైైన్ గేమింగ్ ఎఫెక్ట్.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలి

Korean Lover Game: సారీ నాన్నా.. ఆన్ లైైన్ గేమింగ్ ఎఫెక్ట్.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలి
Advertisement

Korean Lover Game: ఫోన్ ముట్టుకోవద్దు అనడమే పాపమైందా? గేమ్స్‌ జోలికి వెళ్లొద్దని మందలించడమే శాపంగా మారిందా? అనే క్వశ్చన్స్‌ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. దీనికి కారణం ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన దారుణం. కొరియన్ కల్చర్ వీడియోస్, మొబైల్ గేమ్స్‌కు బానిసైన ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మాములుగా ఒకేసారి ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారనేది ఓ దారుణం కాగా.. దానికి కారణం మొబైల్ గేమ్స్‌ అనేది మరింత దారుణం.

గేమ్ మాయలో .. అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో చేతన్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుర్లు. 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పఖి. ఈ అమ్మాయిలు ముగ్గురు రెండేళ్లుగా స్కూల్‌కు కూడా వెళ్లడం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని తెలుస్తోంది. అలా ఇంట్లో ఉండటంతో మొబైల్ వారికి ఒక రిలాక్సేషన్‌గా మారింది. సరదాగా కొరియన్ మూవీస్, డ్రామాలు చూసేవారు. ఆ తర్వాత కొరియన్ కల్చర్‌ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. ముఖ్యంగా కొరియన్ లవర్ అనే మొబైల్‌ గేమ్‌ వారికి ఒక వ్యసనంగా మారింది. ఈ గేమ్‌లో అనేక టాస్క్‌లు ఉంటాయి. ఒక్కో టాస్క్‌ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

తండ్రి ఫోన్ ఇవ్వలేదని బిల్డింగ్ పైనుంచి దూకి

Advertisement

గేమ్స్‌కు పిల్లలకు ఓ వ్యసనంలా మారడంతో తండ్రి గమనించాడు. ఈ గేమ్స్, వీడియోస్‌కు వీరు ఎక్కువగా అలవాటుపడటం, ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడిపేస్తుండటంతో వారి తండ్రి మొబైల్ ఇవ్వడం మానేశాడు. మొబైల్ వాడకుండా నిషేధం విధించాడు. ఇదే ఇప్పుడు ఆ తండ్రి పాలిట పాపమైంది. మొబైల్‌ గేమ్సే ఓ లోకంగా బతకడం అలవాటైన ఆ పిల్లలకు చేతిలో మొబైల్ లేకపోవడంతో ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి తండ్రికి ఓ లెటర్‌ రాసి.. బిల్డింగ్‌ పైనుంచి దూకేశారు.

మేము లోన్లీగా ఫీలవుతున్నాం.. అందుకే వెళ్ళిపోతున్నాం

మొత్తం 8 పేజీల సూసైడ్ లెటర్ రాసినట్టు గుర్తించారు. తాము లోన్లీగా ఫీలవుతున్నాం.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాం అనేది ఆ లెటర్ సారాంశం. సారీ నాన్న.. నన్ను క్షమించండి. డైరీలో రాసినవి అన్నీ చదవండి. ఎందుకంటే.. ఇవి నిజాలు కాబట్టి. ఇప్పుడే చదవండి నాన్న అని డైరీలో రాసి ఉంది. చివర్లో కన్నీరు పెడుతున్న ఎమోజీ ఉంది. ఆ ముగ్గురిలో ఒకరు గదిలో ఓ గోడపై.. నేను చాలా చాలా ఒంటరిగా ఉన్నాను.. నా జీవితం చాలా చాలా ఒంటరిగా ఉంది అని రాశారు.

మీ పిల్లలు కూడా ‘కొరియన్ లవర్’ గేమ్ ఆడుతున్నారా?

Advertisement

కోవిడ్ సమయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు టాస్క్ బేస్డ్ కొరియన్ ఆన్‌లైన్ గేమ్ కొరియన్ లవర్‌కు బానిసలుగా మారినట్టు తెలుస్తోంది. గంటలు, గంటలు గేమ్ ఆడుతూ గడిపేవారు. అంతేకాదు.. తమ పేర్లు మార్చుకుని కొరియన్ పేర్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడీ గేమ్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ గేమ్ కొరియన్ పాప్ కల్చర్, కె-డ్రామాలు, వర్చువల్ డేటింగ్ థీమ్‌ల నుండి ఇన్‌స్పైర్ అయిన ఆన్‌లైన్, టాస్క్-ఆధారిత రొమాంటిక్ గేమ్‌. ఈ గేమ్ ఆడే ప్లేయర్స్‌ వర్చువల్‌గా లవ్‌కు సంబంధించిన టాస్క్‌లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వేరే ప్లేయర్స్‌తో మాట్లాడుతారు. ఇదంతా కూడా కొరియన్ కల్చర్‌లోనే కమ్యూనికేట్ చేస్తారు. రొమాంటిక్ చాట్స్ పంపుతారు. ఇందులో రోజువారీ టాస్క్‌లు ఉంటాయి.

ఆన్‌లైన్ ఆటల్లో దాగి ఉన్న ప్రమాదాలు!

మొదట్లో ఈ టాస్క్‌లు చాలా సింపుల్‌గా ఉంటాయి. ఫోటోలు పంపడం.. మేసేజ్‌లు చేయడం ఉంటుంది. అలా అలా సింపుల్‌ టాస్క్‌లు కాస్త కాంప్లికేటేడ్‌గా మారతాయి. కొన్ని పర్సనల్‌గా ఇంపాక్ట్‌ చూపించేలా ఉంటాయి. కొన్ని టాస్క్‌లు మనల్ని గాయపరిచేలా.. కొన్ని ప్రాణాంతకంగా ఉండేలా ఉంటాయి. ఇలాంటి గేమ్స్‌ ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా దొరుకుతాయి. పిల్లలు కూడా వీటిని డౌన్‌లోడ్ చేసి పరిచయం లేని వారితో మాటలు కలుపుతారు. ప్లేయర్స్‌ లేకపోతే చాట్‌బోట్స్‌ రిప్లైలు ఇస్తూ ఉంటాయి. ఎమోషనల్‌గా ఇతరులపై డిపెండ్ అయ్యేలా చేస్తాయి. పిల్లలు రియాలిటీ, వర్చువల్‌ మధ్య ఉన్న తేడాను గమనించే స్థితిలో ఉండరు కాబట్టి.. ఎక్కువగా ప్రభావితమవుతారు.

ఏం జరిగినా మేము నీకు తోడుంటాం

ఇప్పటికే ఈ ముగ్గురు పిల్లలు ఉపయోగించిన ఫోన్స్‌ను అనలైజ్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ అనాలసిస్‌తో అసలు ఏయే గేమ్స్‌ ఆడారు? అందులో ఎలాంటి టాస్క్‌లను కంప్లీట్ చేశారు? అనే దానిపై ఓ క్లారిటీ రానుంది. మొత్తానికి ఈ గేమ్స్‌ మరోసారి గేమ్స్‌ మాయలో పిల్లలు పడితే వాటి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పేరెంట్స్‌ ఎలా రియాక్ట్ కావాలి? పిల్లలను ఈ ఊబి నుంచి ఎలా బయటపడేయాలి?

ఆట కాదు.. అదొక ప్రాణాంతక ఉచ్చు!

ఒకప్పుడు గేమ్స్ అంటే గ్రౌండ్‌లో అందరితో కలిసి ఆడుకునేవారు పిల్లలు, టీనేజర్స్. కానీ ఇప్పుడు అది నాలుగు గోడల మధ్య, కళ్లద్దాల వెనుక, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై మాత్రమే ఆడుతున్నారు. కొన్నేళ్ల క్రితం బ్లూ వేల్‌ అనే గేమ్ ఉండేది. ఇది కేవలం గేమ్ కాదు.. ఒక ఎమోషనల్ ట్రాప్. 50 రోజుల పాటు కఠినమైన టాస్క్‌లు ఇస్తూ, చివరికి ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించే ఈ గేమ్. ఎంతోమంది టీనేజర్లను బలి తీసుకుంది ఈ గేమ్.

వర్చువల్ లోకం.. రియల్ విషాదం

ఆ తర్వాత పబ్‌ జీ గేమ్ కూడా ఇదే ఇంపాక్ట్ చూపించింది. ఈ గేమ్‌ చాలా మందికి ఓ వ్యసనంగా మారింది. గేమ్‌ ఆడనివ్వకపోవడంతో చాలా మంది బాలురు, టీనేజర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కొరియన్ లవ్ గేమ్.
ఇలా గేమ్‌లకు అడిక్ట్ అవ్వడం వల్ల నిద్ర సరిగా పోరు. మరో గేమ్.. ఇంకొద్ది సేపు ఆడుతాం అనుకుంటూ నిద్రకు దూరమవుతారు. అలా సరిగా నిద్రపోకపోవడం.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చుట్టుపక్కల ఉన్నవారితో మాట్లాడటం మానేస్తారు. అంతేకాదు ఈ గేమ్స్‌లో ఓడిపోవడం కూడా ఓ అవమానంగా భావించేవారు లేకపోలేదు.

పిల్లల చేతిలో ఫోన్ ఉందా? లేక ఫోన్ చేతిలో పిల్లలున్నారా?

పిల్లల్లో మారే ప్రవర్తనను మొదటగా గుర్తించేది తల్లిదండ్రులే. అలా దారి తప్పుతున్న పిల్లలతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. గేమ్స్‌ను ఉన్నట్టుండి మానేయమని చెప్పకుండా.. రోజు వారికి కొంత టైమ్ కేటాయించమని చెప్పాలి. ఫోన్ పక్కన పెట్టిన తర్వాత వారికి బోర్ కొట్టకుండా.. ఔట్‌ డోర్ గేమ్స్‌ను ఎంకరేజ్ చేయాలి. అసలు పిల్లలు ఏ గేమ్ ఆడుతున్నారు? అందులో ఏముంది? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేది ఒక లుక్ వేయాలి. అంతేగానీ గేమ్ మధ్యలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఫోన్ లాక్కోవడం వల్ల పిల్లల్లో మొండితనం పెరుగుతుంది. యూపీ ఘటనలో ఇదే జరిగినట్టు తెలుస్తోంది.

ఫోన్ పక్కన పెడదాం.. లోకాన్ని చుట్టేద్దాం!

పిల్లలకు గేమ్స్‌ మాత్రమే కాదు.. లైఫ్‌లో ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయనేది తెలియజేయాలి. గేమ్ ఆడకపోతే చాలా మందిలో లోన్లీ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. అది దరి చేరకుండా చూసుకోవాలి. ఇకపై ఫోన్‌ను అసలే టచ్ చేయవద్దు అంటూ మనం వేసే ఆర్డర్.. మరింత ప్రమాదకరం అంటున్నారు సైకాలిజిస్టులు. అది దొంగచాటుగా ఆడటానికో.. లేక ఎదురు తిరగడానికో దారి తీస్తుంది తప్ప.. ఫలితం ఉండదని చెబుతున్నారు.

ఆ ఆట ‘వ్యసనం’గా మారకముందే మేల్కొందాం!

మాములుగా ఇలా గేమ్స్‌ ఓ వ్యసనంగా మార్చుకోవడం.. అది లేకపోతే బతకలేం అనుకోవడాన్ని బిహేవియరల్ డిజార్డర్‌గా పరిగణిస్తారు సైకాలజిస్టులు. అలాంటి వారి కోసం ఒకరోజు నో గ్యాడ్జెట్ డేగా ప్రకటించి పిల్లలతో గడపాలని సూచిస్తున్నారు. పిల్లలు గేమ్స్‌ ఆడేందుకు అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు. ఫ్రెండ్స్ లేని వారు.. ఇంట్లో పనులు తప్పించుకోవాలనుకునేవారు.. రియల్ లైఫ్‌లో కిక్‌ దొరకని వారు మొబైల్ ప్రపంచమని బతికేస్తుంటారు. ఇందులో ఏ కారణంతో ఇలాంటి పరిస్తితి వచ్చిందో గుర్తించి.. చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు సైకాలజిస్టులు.

ఫోన్ లేకపోతే విపరీతంగా అరవడం లేదా వస్తువులు విసిరేయడం.. గేమ్స్ ఆడటం గురించి అబద్దాలు చెప్పడం.. వారిలో ఆకలి, నిద్ర లేకపోయినా గేమ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేయడం చేస్తే మాత్రం.. వెంటనే కౌన్సిలింగ్‌ ఇప్పించాలని చెబుతున్నారు.

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×