E-Paper
Advertisement

Rashmika Mandanna dedication: రష్మిక అలాంటిదే.. ఏమి పట్టించుకోలేదు.. ఆనంద్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Rashmika Mandanna dedication: రష్మిక అలాంటిదే.. ఏమి పట్టించుకోలేదు.. ఆనంద్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!
Advertisement

Rashmika Mandanna dedication: ప్రస్తుతం సినీ పరిశ్రమలో రష్మిక మందన్న పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వం, పనిపట్ల చూపే నిబద్ధత గురించి చాలామంది నటీనటులు మంచి మాటలు చెబుతూ ఉంటారు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన పుష్పక విమానం సినిమాలో హీరోయిన్‌గా నటించిన శాన్వి మేఘన రష్మిక గురించి చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాన్వి మేఘన.. రష్మిక మందన్న ఇద్దరూ ఒకసారి కలిసి వీనస్.. యాడ్ షూట్‌లో పనిచేశారు. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను శాన్వి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

?igsh=MTlpYTE5emdvNjJlaQ==

శాన్వి మాట్లాడుతూ, ఆ యాడ్ షూట్ సమయంలో తాను పుష్పక విమానం సినిమా చేస్తున్నానని రష్మికకు చెప్పానని తెలిపారు. “నేను పుష్పక విమానం సినిమా చేస్తున్నానని చెప్పగానే రష్మిక చాలా ఎక్సైటెడ్ అయింది. ‘మీరేనా ఆ సినిమా హీరోయిన్?’ అని చాలా సంతోషంగా అడిగింది. ఆమె మాట్లాడే విధానం చాలా సహజంగా ఉంటుంది” అని చెప్పారు.

అచ్చం అలానే ఉంటుంది..!

Advertisement

ఇంకా రష్మిక వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ శాన్వి మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “బయట ఇంటర్వ్యూల్లో ఎలా ఉంటుందో.. నిజ జీవితంలో కూడా రష్మిక అచ్చం అలాగే ఉంటుంది. చాలా స్వీట్‌గా, సింపుల్‌గా మాట్లాడుతుంది. మనం బయట చూసే రష్మిక లాగానే.. నిజ జీవితంలో కూడా ఉంటుంది” అని ఆమె చెప్పారు.

అసలు ఏమీ పట్టించుకోలేదు..!

అదే సమయంలో ఆ యాడ్ షూట్ జరిగిన రోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా జరిగిందని శాన్వి గుర్తు చేశారు. “ఆ రోజు రష్మికకు 103 డిగ్రీల ఫీవర్ ఉంది. నేను ఆమె దగ్గరికి వెళ్లినప్పుడు తాకితే కాలిపోతున్నట్టు అనిపించింది. అయినా కూడా ఆమె ఒక్కసారి కూడా అలసట చూపించలేదు. చాలా ఎనర్జీతో షూట్‌లో పాల్గొంది” అని తెలిపారు.

“ఫీవర్ ఉన్నా కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా యాక్టివ్‌గా యాడ్ షూట్ పూర్తి చేసింది. అప్పుడే ఆమె పని పట్ల ఎంత డెడికేషన్ ఉంటుందో నాకు అర్థమైంది” అని శాన్వి మేఘన చెప్పారు.

రష్మిక గురించి శాన్వి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. అభిమానులు కూడా రష్మిక పనిపట్ల చూపించే అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా రష్మిక ఆనంద దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ ని పెళ్లి చేసుకోగా.. వీరిద్దరికి సంబంధించిన పెళ్లి అలానే రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

ALSO READ: Anaswara Rajan: విజయ్ ని వదులుకోలేను.. విత్ లవ్ నటి కీలక వ్యాఖ్యలు..!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×