E-Paper
Advertisement

BRS : రిలాక్స్ అవుతున్న బీఆర్ఎస్ నేతలు..!

BRS : రిలాక్స్ అవుతున్న బీఆర్ఎస్ నేతలు..!
Advertisement

బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తున్నది. పార్టీ నుంచి ఎటువంటి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, సంస్థాగత మార్పులకు సంబంధించిన అప్‌డేట్స్ లేకపోవడంతో వారంతా ప్రస్తుతం తమ వ్యాపారాలు, వ్యక్తిగత పనుల్లో నిమగ్నం అయినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా మాజీ మంత్రులు అసలు కనిపించడం లేదు. మొన్నటివరకు యాక్టివ్‌గా ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు కనిపించడం లేదు. మరో మంత్రి మల్లారెడ్డి ఇటీవల హోలీ వేడుకల్లో తన కేడర్‌తో రంగులు పూసుకుంటూ సందడి చేశారు. అనంతరం ఆయన కూడా కనిపించడం మానేశారు.

కేసీఆర్ సమీక్షలు..!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫౌంహౌస్‌లోనే ఉంటున్నారు.రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,ప్రజల ఇబ్బందులు, సర్కారు నిర్ణయాలు, ప్రాజెక్టుల వివరాలు, ఆరు గ్యారెంటీల అమలుపై రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తున్నది.దీనికి తోడు క్రేత్ర స్థాయిలో ప్రజలు బీఆర్ఎస్ మీద నెగెటివ్‌తో ఉన్నారా? ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతమేర ఉన్నది, హామీల అమలుపై ప్రజలు గుర్రుగా ఉన్నారా? ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? ఇలా అన్ని అంశాలపై కేసీఆర్ సమీక్షిస్తున్నట్టు సమాచారం.దీనికి తోడు ఇటీవల బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న విచారణలు, అరెస్టులపైనా ఆరా తీస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది.

నో ఎలక్షన్స్..

Advertisement

సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి.ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు సైతం ఎన్నికలు ఉంటాయని భావించగా.. ప్రభుత్వం నిర్ణయంతో అవి జూన్ లేదా జూలైలో జరిగే ఆస్కారం ఉన్నట్టు సమాచారం. దీనికి తోడు సమ్మర్ ఎఫెక్ట్ కావడంతో ఎటువంటి రోడ్ షోలు, నిరసనలు, ప్రజాకార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునివ్వడం లేదని తెలుస్తున్నది. కేడర్ విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా నిరసనలు, కార్యక్రమాలు చేపట్టాలన్న ఉదయం, సాయంకాలం మాత్రమే ప్లాన్ చేయాలని గులాబీ నేతలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Kalyan Padala : అబ్బా.. కళ్యాణ్ పడాల ఏమున్నాడ్రా బాబు..

Advertisement

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసే బాధ్యతను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్ రావు,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తున్నారు. కోర్ అర్బన్, మూసీ సుందరీకరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల తరఫున వారిద్దరూ సర్కారును నిలదీస్తున్నారు.పెట్టుబడుల లెక్కలు, ఆరు గ్యారంటీల అమలు, ఉద్యోగులు, జర్నలిస్టుల సమస్యలపైనా గొంతెత్తుతున్నారు. అంతకుమించి పెద్దగా కార్యక్రమాలు మాత్రం చేపట్టడం లేదు. ఎలాగూ ఎన్నికలు లేనందున కేవలం విమర్శలతోనే సరిపెడుతున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి గులాబీ బాస్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారని పార్టీలో చర్చ జరుగుతున్నది. అప్పటివరకూ కీలక నేతలంతా రిలాక్స్ మోడ్‌లోనే ఉంటారని టాక్ వినిపిస్తోంది. మరికొందరు నేతలు సమ్మర్ నేపథ్యంలో విదేశీ పర్యటనలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హిల్ స్టేషన్స్‌కు వెళ్లేందుకు, కొంతకాలం రాజకీయాలకు బ్రేక్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై కేడర్‌కు సైతం ఇప్పటికే హింట్ ఇచ్చినట్టు సమాచారం.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×