Anaswara Rajan: ఈ మధ్య విడుదలైన విత్ లవ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయింది తమిళ హీరోయిన్… అనస్వర రాజన్. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళుతోంది. ముఖ్యంగా విత్ లవ్ చిత్రంలో ఆమె నతన యువతను బాగా ఆకట్టుకుంది.
అనస్వర రాజన్ మొదట మలయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చిన్నపాటి పాత్రలతో మొదలైన ఆమె కెరీర్ తర్వాత హీరోయిన్‌గా మారింది. మలయాళ సినిమాల్లో ఆమె నటనకు మంచి స్పందన రావడంతో దర్శకులు, నిర్మాతల దృష్టి ఆమెపై పడింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా మంచి కథలతో అవకాశాలు రావడం ప్రారంభమైంది.
మలయాళంతో పాటు ఇతర భాషల్లో.. కూడా నటించాలని అనస్వర ఆసక్తి చూపుతోంది. తమిళం, తెలుగు భాషలలో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కొత్త కథలు, విభిన్న పాత్రలు చేయాలని ఆమె ఎప్పుడూ ఆసక్తి చూపుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల ద్వారా కూడా ఆమె మంచి గుర్తింపు పొందింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా అనస్వర రాజన్.. శ్రీకాంత్ కొరకు రోషన్ హీరోగా వచ్చిన ఛాంపియన్ సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా పెద్దగా విషయం సాధించకపోయిన ఈ చిత్రంలో ఈ హీరోయిన్ చేసిన గిరగిరా సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో తెలుగులో కూడా మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పుడామె తమిళంలో తెరకెక్కుతున్న “7G రెయిన్‌బో కాలనీ 2” సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సినిమా విడుదల తర్వాత ఆమెకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనస్వర రాజన్ తనకు ఇష్టమైన హీరోల గురించి మాట్లాడింది. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. విజయ్ నటన, స్టైల్ తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపింది. చిన్నప్పటి నుంచే విజయ్ సినిమాలు చూస్తూ పెరిగానని కూడా చెప్పింది.
“విజయ్ సర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు నాకు చాలా ప్రేరణ ఇస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను విజయ్ అభిమానిని గా.. ఉండటం మానను. ఆయన్ని నా అభిమాన హీరోగా వదులుకోలేను” అని ఆమె నవ్వుతూ చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ అభిమానులు కూడా ఆమె మాటలను ఆసక్తిగా పంచుకుంటున్నారు.
ALSO READ: Divya Bharathi: పర్ఫెక్ట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న దివ్యభారతి!