Rashmika Mandanna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న(Rashmika mandanna), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వివాహం తర్వాత చేసిన చిత్రం రణబాలి. ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడంతో ఈ జంట వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు . అందులో భాగంగానే సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే విమర్శలు, వారు పాల్గొనే టాక్ షోలలో పంచుకునే వ్యక్తిగత అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్ ‘ సీజన్ 9 షోలో విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ను అసభ్యకరంగా చూపించారు అనే వివాదం పై స్పందించిన ఈమె.. నటీనటులు తమ అభ్యంతరాలను చెబితే ఇండస్ట్రీ ఎక్కడ అన్ ప్రొఫెషనల్ అని ముద్ర వేస్తుందో నన్న భయంతోనే ఒత్తిడికి లొంగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తన వరకు వస్తే మాత్రం నిర్మొహమాటంగా నో చెబుతాను అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది..
ముఖ్యంగా పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ ను అసభ్యంగా చూపించారనే విమర్శలపై రష్మిక మాట్లాడుతూ..,” కమర్షియల్ సినిమాలు బికినీ అలాగే స్కిన్ షోని డిమాండ్ చేస్తాయి. కానీ నాకు అసౌకర్యంగా అనిపిస్తే.. వెంటనే ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టం ఉండదని చెప్పేస్తాను. ఎందుకంటే నేను అలాంటి పర్సన్ ని కాదు. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి . వాటిని దాటి నేను ముందుకు వెళ్లలేను. ముఖ్యంగా ఈ విషయాలలో విజయ్ సలహా ఖచ్చితంగా తీసుకుంటాను.
also read:కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!
కమర్షియల్ చిత్రాలు చేసేటప్పుడు పూర్తిగా అసౌకర్యంగా అనిపించే కాస్ట్యూమ్స్ ఉంటాయి. అయితే వాటి కోసం నేను నా హద్దులు చెరపలేను. అందుకే నేను అలాంటి దుస్తులు ధరించనని ధైర్యంగా దర్శకులతో చెబుతాను. వారు కూడా చాలా సందర్భాలలో ఈ విషయంపై అంగీకరించారు కూడా.. ఎందుకంటే నేను అలాంటి వారితోనే పనిచేయడానికి ఇష్టపడతాను. ముఖ్యంగా ఈ విషయంలో విజయ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. నేను ఇలా ధరించకూడదు అనుకొని వాళ్లతో చెప్పాలనుకున్నట్లు విజయ్ తో చెబితే, ఆయన నువ్వు చెప్పచ్చు.. తప్పకుండా చెప్పాలి కూడా అని నాకు ఎన్నోసార్లు సపోర్టు ఇచ్చారు. అంటూ రష్మిక తెలిపింది.
ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొనే తీవ్రమైన మానసిక ఒత్తిడిని బయటపెడుతూ..” ఒకసారి సినిమా సంతకం చేశాక ప్రొఫెషనలిజం పేరుతో నటీనటులను ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు . నువ్వు యాక్టర్ వి కదా.. ఇది నీ ఉద్యోగంలో భాగమే కదా.. దీనికే నువ్వు అంతగా ఫీలవుతున్నావేంటి అని ఇతరులు ప్రశ్నించినప్పుడు.. నటీనటులు తాము ఎక్కడ అన్ ప్రొఫెషనల్ గా కనిపిస్తామేమో అని భయపడతారు. ఆ భయంతోనే మనసులో ఇష్టం లేకున్నా పోనీలే అని సర్దుకుపోతున్నారు. కానీ ఆ సినిమా థియేటర్లలోకి వచ్చి, ఆ క్లిప్పుల సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు.. అప్పుడే నేను ధైర్యంగా వద్దు అని చెప్పి ఉంటే బాగుండేది అని తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నారు” అంటూ విజయ్ ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి పై ఈ జంట ఇచ్చిన వివరణ అందరిని ఆకట్టుకుంది.