E-Paper
Advertisement

కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!
Advertisement

Bigg boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఏడవ వారంలో ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో 12 మంది నామినేషన్ లోకి వచ్చేసారు. అయితే 12 మంది నామినేషన్ లోకి రావడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్స్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉండడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ దిశగా ఇంటికి వెళ్ళబోయే ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరా? అని ఆడియన్స్ సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వారం ఇంటికి వెళ్లబోయే ఆ కంటెస్టెంట్స్ ఎవరు? డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు? టాప్ లో ఎవరు కొనసాగుతున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఓటింగ్లో ఊహించని మార్పు..

స్టార్ మా అధికారికంగా నామినేషన్ లిస్ట్ జాబితా ప్రకటించడమే కాకుండా తమ అభిమాన కంటెస్టెంట్ హౌస్ లో కొనసాగాలంటే ఓటు వేయండి అంటూ ప్రకటించింది. దాంతో ఓటింగ్ పోల్ ప్రారంభం అయ్యింది. మరొకవైపు ఏడవ వారం నామినేషన్ నుండి తప్పించి సీక్రెట్ రూమ్ లో పెట్టిన షాలినినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇకపోతే షాలిని రీ ఎంట్రీ ఇవ్వడం కంటెస్టెంట్స్ కి పెద్దగా నచ్చలేదని, వాళ్ళ మొహాలు, వాళ్ళ మాటలు చూస్తే అర్థమవుతున్నాయి. ఇకపోతే దీంతో ఆటలో మాటల యుద్ధాలు , షోపై ప్రేక్షకులలో ఆసక్తిని విపరీతంగా పెంచేస్తున్నాయి . ముఖ్యంగా ఈ ఏడో వారంలో నామినేషన్ ప్రక్రియ చాలా రంజుగా సాగింది. ఈ వారం ఓటింగ్ లో రోహిత్ వెనుకబడిపోయాడు. దీనికి కారణం కంటెస్టెంట్స్ తో ప్రవర్తన, వారి ఆటతీరు ఓటింగ్ ట్రెండ్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది ఇప్పటివరకు ఓటింగ్ లో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయిన రోహిత్ గ్రాఫ్ ఈ వారం ఊహించని విధంగా డౌన్ అయిపోయింది.

Advertisement

also read:ప్రేమ, పెళ్లిపై మిథిలేష్ కామెంట్స్.. బాబుకి పెద్ద కోరికలే!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్..

ఇక మొన్నటివరకు సెకండ్ ప్లేస్ లో ఉన్న వారికి ,రోహిత్ కి మధ్య తేడా చాలా ఉండేది. కానీ ఈ వారం ఓటింగ్ దాదాపు పెరిగింది . ప్రస్తుతం రోహిత్ 25% ఓటింగ్ తో దూసుకుపోతుంటే.. ఏకంగా 24% ఓటింగ్ తో రోహిత్ కి అతి సమీపంలో చేరుకున్నారు త్రిగుణ్. ఇక ఇద్దరి మధ్య పోటీ హోరా హోరీగా కొనసాగుతోంది.. రోహిత్ వ్యవహార శైలి, ప్రవర్తన కారణంగానే ఆయన ఓటింగ్ గ్రాఫ్ కొంత నెమ్మదించిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. గ్రాండ్ ఫినాలేకి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను ఉంచాలంటే.. మిగిలిన ఏడు వారాలలో కనీసం రెండు లేదా మూడు డబుల్ ఎలిమినేషన్లు జరగాల్సిందే. పైగా ఈసారి ఏకంగా 12 మందిని నామినేట్ చేయడం ద్వారా బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ కి ప్లాన్ చేశారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరు బయటకు వెళ్ళనున్నారా?

Advertisement

ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో ఆర్కే రామకృష్ణ మూడవ స్థానం మిగతా కంటెస్టెంట్లు తక్కువ ఓట్లతో కింది స్థానాలలో ఉన్నారు. అటు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన నీతూ మాస్టర్, దక్షి గుత్తికొండ ఇద్దరు కూడా కేవలం రెండు శాతం ఓట్లతో లీస్ట్ పొజిషన్లో కొనసాగుతూ డేంజర్ జోన్ లో నిలిచారు. ఒకవేళ ఈ వారం కనుక డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. ఈ ఇద్దరూ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వీకెండ్ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.. ఇక హోస్ట్ నాగార్జున ఎవరిని సేవ్ చేస్తారో.. ఎవరిని ఎలిమినేట్ చేస్తారో తెలియదు.

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు క్లాస్ పీకిన మీనా.. బాలు గెలిచాడు.. రోహిణి దొరుకుతుందా..?

Podarillu Today Episode : కేశవకు షాక్.. మహా ప్లాన్ అదుర్స్.. ఫ్యామిలీ పార్టీ..

Karthika Deepam 2 Serial Today Episode October 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రతో చాలెంజ్ చేసి ఆఫీసుకు వెళ్లిన జ్యోత్స్న   

Illu Illalu Pillalu Today Episodes: వల్లి పై చందు సీరియస్.. చివర్లో భద్ర ట్విస్ట్.. మైండ్ బ్లాక్ అయ్యే సీన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కన్నీళ్లు.. భానుమతికి స్ట్రాంగ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode October 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు ప్రాణగండం –  రేఖ కొత్త ప్లాన్‌  

Nindu Noorella Saavasam Serial Today Episode October 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: విడిపోయిన అమర్, మిస్సమ్మలను పిల్లలు కలుపుతారా..?    

Big Stories

Advertisement
×