E-Paper
Advertisement

ఎల్ఐసిలో ఫ్రెషర్స్ జాబ్స్.. 232 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఎల్ఐసిలో ఫ్రెషర్స్ జాబ్స్.. 232 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి
Advertisement

LIC Jobs| డిగ్రీ పూర్తి చేసి మంచి శిక్షణతో పాటు ఉద్యోగ అనుభవం పొందాలని చూస్తున్నారా? అయితే మీ కోసమే LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అప్రెంటిస్ అవకాశాలను ప్రకటించింది. LIC HFL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 ద్వారా మొత్తం 232 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన వారికి 12 నెలల పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.14,150 నుంచి రూ.16,650 వరకు స్టైపెండ్ లభిస్తుంది. దరఖాస్తు చేసే ముందు అర్హతలు, పరీక్ష తేదీలు, ఎంపిక విధానం తెలుసుకోవడం ముఖ్యం.

LIC HFL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ వివరాలు తెలుసుకోండి

Advertisement

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన అప్రెంటిస్ ప్రొగ్రామ్ -010 లో భాగంగా ఈ నియామకాలను చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థులు ఆర్థిక సేవల రంగంలో పని అనుభవం పొందవచ్చు.

  • సంస్థ పేరు: LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
  • పోస్టుల సంఖ్య: 232
  • పోస్టు పేరు: అప్రెంటిస్
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • శిక్షణ వ్యవధి: 12 నెలలు
  • నెలవారీ స్టైపెండ్: రూ.14,150 నుంచి రూ.16,650 వరకు

అర్హతలు, వయోపరిమితి

అభ్యర్థులు UGC లేదా AICTE గుర్తింపు పొందిన యునివర్సిటీ లేదా కాలేజీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2026 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇతర సంస్థలో ప్రస్తుతం అప్రెంటిస్ శిక్షణ పొందుతున్నవారు, శిక్షణ మధ్యలో ఆపినవారు లేదా ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారు అర్హులు కారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

అప్రెంటిస్ ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్

Advertisement

ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 12 నెలల పాటు శిక్షణ అందిస్తారు. మెట్రో నగరాల్లో శిక్షణ పొందేవారికి నెలకు రూ.16,650 చెల్లిస్తారు. ఇతర నగరాల్లో శిక్షణ పొందేవారికి నెలకు రూ.14,150 అందిస్తారు. అయితే, ఇది సాధారణ శాశ్వత ఉద్యోగ నియామకం కాదు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత LIC HFLకు లేదు. శిక్షణాకాలంలో మీ పనితీరు ఆధారంగా ఉద్యోగం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 20, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 1, 2026
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబర్ 1, 2026
ఆన్‌లైన్ పరీక్ష: నవంబర్ 7, 2026
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ: నవంబర్ 15, 2026
ఎంగేజ్‌మెంట్ లెటర్లు: నవంబర్ మూడో వారంలో
శిక్షణ ప్రారంభం: నవంబర్ నాలుగో వారంలో

Also Read: ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్

ఎంపిక విధానం, పరీక్ష వివరాలు

మొదట ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు, 25 మార్కులు ఉంటాయి.

Also Read: దీపావళి ముందు తగ్గిన బంగారం ధరలు.. మరింత తగ్గుతాయా?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా చేయాలి?

అర్హులైన అభ్యర్థులు LIC HFL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్రెంటిస్ నోటిఫికేషన్‌ పరిశీలించాలి. సూచనల ప్రకారం వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తును సమర్పించే ముందు అన్ని వివరాలను సరిచూసుకోవాలి. చివరిగా, అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలు మరోసారి నిర్ధారించుకోవాలి.

Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

Tags

Related News

భార్య తల నరికి త్రిశూలంపై పెట్టి తాంత్రిక పూజ, బెంగాల్‌లో గగుర్పొడిచే ఘటన

రిటైర్డ్ ఆర్మీ దంపతులకు షాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.61.85 లక్షలు స్వాహా!

కేవలం ప్రియుడి కోసం.. కవలలను చంపిన కసాయి తల్లి, రాజస్థాన్‌లో దారుణం

ఇన్‌ఫ్లుయెన్సర్ సూసైడ్.. వేధింపుల వెనుక ఏం జరిగింది? చెన్నైలో ఘటన

మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు

పెళ్లైన జంట.. భర్త ముందే భార్యపై 8 మంది, బీహార్‌లో షాకింగ్ ఘటన

యూకో బ్యాంక్‌లో జాబ్స్.. మొత్తం 530 ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్

Big Stories

Advertisement
×