E-Paper
Advertisement

స్క్రాప్‌ తో సోలార్ కారు తయారీ, ఈ కామన్ మ్యాన్ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

స్క్రాప్‌ తో సోలార్ కారు తయారీ, ఈ కామన్ మ్యాన్ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Advertisement

Solar Car Made from Scrap Goes Viral: ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన ఓ సాధారణ గ్రామస్తుడు తన తెలివి తేటలతో అద్భుతాన్ని సృష్టించాడు. ఆయన పేరు సాధుల్‌ భాయ్ చావడా. తన తెలివితో ఇతడు పూర్తిగా సౌరశక్తితో నడిచే  కారును స్వయంగా తయారు చేశాడు. అదీ అవసరం లేని పాత ఇనుమసామానుతో. ఇంతకీ ఆయన తయారు చేసిన కారు ప్రత్యేకతలు ఏంటంటే..

సూర్యరశ్మితో నడిచే కారు

ఈ కారుకు పెట్రోల్ అవసరం లేదు. సాధారణ ఎలక్ట్రిక్ వాహనాల్లా ఛార్జింగ్ ఖర్చులు కూడా ఉండవు. ఎందుకంటే ఈ వాహనం పూర్తిగా సోలార్ పవర్ తో నడుస్తుంది. కారు మీద అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యకాంతి విద్యుత్తుగా మార్చుకుని నడుస్తుంది. ముఖ్యంగా, కారు ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఈ ప్యానెల్స్ పని చేస్తూ బ్యాటరీని ఛార్జ్ చేస్తాయి. అందువల్ల అదనంగా ఎక్కడైనా ఛార్జింగ్ కోసం ఆగాల్సిన అవసరం ఉండదు.

రోజుకు 60 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

ఈ వాహనం రోజుకు సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ పనులు, తక్కువ దూర ప్రయాణాలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కారును తయారు చేయడానికి పెద్దగా ఖర్చు కాలేదు. కేవలం రూ. 30,000తోనే సాధుల్‌ భాయ్ ఈ కారును తయారు చేశాడు. అంతేకాదు, ఈ కారులో ఉపయోగించిన చాలా భాగాలు స్క్రాప్ నుంచి తీసుకున్నాడు. పాత వాహన భాగాలు, ఉపయోగం లేని వస్తువులను వినియోగించి ఈ కారును తయారు చేయడం  విశేషం.

సాధుల్ భాయ్ పై స్థానికుల ప్రశంసలు

Advertisement

ఈ కారు తయారు చేసిన సాధుల్ భాయ్ పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, ఈ కారును అద్భుతంగా తయారు చేశారని అభినందిస్తున్నారు. ఈ ప్రయత్నం కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇంధన సమస్యలకు ఒక సాధ్యమైన పరిష్కారం చూపించబోతుందని అభినందిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలపై ఆధారపడకుండా, సూర్యశక్తిని ఉపయోగించడం అద్భుతం అంటున్నారు.  అంతేకాదు, సాధుల్‌భాయ్ చావడా చేసిన ఈ ఆవిష్కరణ చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. తక్కువ ఖర్చుతో, అందుబాటులో ఉన్న వనరులతో కూడా కొత్త ఆలోచనలు అమలు చేయవచ్చని ఆయన నిరూపించాడు. గ్రామీణ స్థాయిలోని ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు దేశ అభివృద్ధికి దోహదపడతాయని చాటి చెప్పాడు. ఈ సౌరశక్తితో నడిచే కారు ఒక సాధారణ వ్యక్తి చేసిన అసాధారణ ప్రయత్నం. ఇది కేవలం ఒక వాహనం కాదు, భవిష్యత్తు కోసం ఒక మార్గదర్శకం కూడా.

Read Also: గమ్యానికి చేరినా కాసేపు కారులోనే కూర్చుంటున్నారా? సైకాలజీ చెప్పే షాకింగ్ నిజాలు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×