E-Paper
Advertisement

టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు సెట్స్ నుంచి వెళ్లిపోయాడు.. రవిబాబు షాకింగ్ కామెంట్స్

టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు సెట్స్ నుంచి వెళ్లిపోయాడు.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
Advertisement

Ravi Babu: సినిమా రంగంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే దర్శకుడు రవిబాబు, సెట్స్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. నటీనటులకు ఉండాల్సిన నిబద్ధత, సమయపాలన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆర్టిస్టుల ప్రవర్తన ఒక్కోసారి ఎంత విచిత్రంగా ఉంటుందో చెబుతూ రవిబాబు రెండు ప్రధాన సంఘటనలను ప్రస్తావించారు: ఒక ఆర్టిస్ట్ షూటింగ్‌కు వచ్చి, కేవలం టిఫిన్‌లో తనకు ఇష్టమైన ‘వడ’ లేదని వెళ్లిపోయారట. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని రవిబాబు తెలిపారు. మరొక సందర్భంలో సీన్ షూటింగ్ జరుగుతుండగానే, వేరే చోట ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటూ ఒక నటుడు పని ఆపేసి వెళ్లిపోయారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Read also-ఘనంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘సు ఫ్రమ్ సో’దర్శకుడి పెళ్లి.. వధువు బ్యాక్ గ్రౌండ్ వైరల్!

పని ముఖ్యం..

Advertisement

నటులకు ఉండాల్సిన మొదటి లక్షణం సమయపాలన అని రవిబాబు స్పష్టం చేశారు. షూటింగ్ సెట్‌కి వచ్చాక 100% ఏకాగ్రత పని మీద మాత్రమే ఉండాలని, వడలు, టిఫిన్లు లేదా క్యారవాన్ సౌకర్యాల గురించి కాదని ఆయన హితవు పలికారు. “డైరెక్టర్, ప్రొడ్యూసర్ పడే కష్టం నాకు తెలుసు, అందుకే నేను ఎవరికీ భారం కాకూడదని అనుకుంటాను” అని తన వృత్తినిబద్ధతను చాటుకున్నారు.

పక్కా ప్లానింగ్

రవిబాబు వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ప్రీ-ప్రొడక్షన్ పనులను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారు. షూటింగ్ మొదలవ్వక ముందే, ఉదాహరణకు 35వ రోజున నటులు ఏ దుస్తులు ధరించాలి అనేది కూడా ముందే నిర్ణయిస్తారు. షూటింగ్‌కు వారం రోజుల ముందే లొకేషన్‌కు వెళ్లి లైటింగ్ ఎక్కడ ఉండాలి, ఆర్టిస్ట్ ఎక్కడ నిలబడాలి వంటి అంశాలను క్షుణ్ణంగా ప్లాన్ చేస్తారు. విశేషమేమిటంటే, రవిబాబు తన సినిమాలకు స్టోరీ బోర్డ్ రాసుకోరు. పూర్తి సన్నివేశాలన్నీ ఆయన మెదడులోనే నిక్షిప్తమై ఉంటాయట.

Advertisement

Read also-Rakul Preet Singh: లేడీ బాస్ గెటప్ లో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

“మర్యాదగా బయటకు పంపేస్తా”

సెట్‌లో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదని రవిబాబు హెచ్చరించారు. ఎవరైనా అనవసరమైన గొడవలు చేస్తే మొహమాట పడకుండా సెట్ నుండి బయటకు పంపించేస్తానని గట్టిగా చెప్పారు. ఇక పాలిటిక్స్ విషయానికొస్తే, తనకు అటు ఇండస్ట్రీ రాజకీయాలు, ఇటు సాధారణ రాజకీయాల పట్ల అస్సలు ఆసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన మాటలు సినిమా పరిశ్రమలో కొంత మంది నియంతలు అనుకునే వీరికి అద్దం పట్టేలా ఉన్నాయి. రానున్న రోజులు కూడా ఇలాగే ఉంటే నిర్మాతలు చాల కష్టపడాల్సి వస్తుంది.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×