E-Paper
Advertisement

ఘనంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘సు ఫ్రమ్ సో’దర్శకుడి పెళ్లి.. వధువు బ్యాక్ గ్రౌండ్ వైరల్!

ఘనంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘సు ఫ్రమ్ సో’దర్శకుడి పెళ్లి.. వధువు బ్యాక్ గ్రౌండ్ వైరల్!
Advertisement

Film industry:ప్రస్తుతం టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అల్లు శిరీష్ వైవాహిక బంధం లోకి అడుగుపెట్టగా .. మరొకవైపు సెలబ్రిటీల వారసులు కూడా వివాహానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ప్రముఖ నటుడిగా, నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్న బండ్ల గణేష్ తన కూతురు జనని నిశ్చితార్ధాన్ని ఇటీవల ఘనంగా జరిపించిన విషయం తెలిసిందే. ఇక అలాగే టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న మెహర్ రమేష్ కూడా తన కూతురు మోహన నిశ్చితార్థాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ రెండు వేడుకలలో మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఘనంగా వివాహం చేసుకున్న దర్శకుడు..

అయితే ఇప్పుడు మరో దర్శకుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.. కన్నడ సినిమాగా వచ్చిన ‘సు ఫ్రమ్ సో’ అటు కన్నడలోనే కాదు ఇటు తెలుగులో కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడికి ఇప్పుడు వివాహం జరిగింది. ఆయన ఎవరో కాదు జేపీ తుమినాడ్.. పాపులర్ యాక్టర్ గా , దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు తన చిరకాల స్నేహితురాలు రష్మిక మెడలో మూడు ముళ్ళు వేశారు.జేపీ తుమినాడ్, రష్మీకల వివాహం మంగళవారం.. మంగళూరు సాంప్రదాయ పద్ధతిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఈ నూతన జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎట్టకేలకు 14 ఏళ్ల ప్రేమాయణానికి పులిస్టాప్..

Advertisement

ఇకపోతే జేపీ, రష్మిక పరిచయం ఇప్పటిది కాదు.. సు ఫ్రమ్ సో సక్సెస్ తర్వాత వచ్చిన ప్రేమ అయితే అసలే కాదు.. వీరిద్దరూ దాదాపు 14 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు.. థియేటర్ నుంచి సినిమా వరకు వీరి పరిచయం ప్రేమగా మారింది . ఆ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. ఇక అలా 14 ఏళ్లపాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట ఇప్పుడు ఎట్టకేలకు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ALSO READ:ఘనంగా తరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో.. ముఖ్య అతిథులు వీరే!

డైరెక్టర్ జేపీ తుమినాడ్ కెరియర్..

Advertisement

డైరెక్టర్ జేపీ తుమినాడ్ కెరియర్ విషయానికి వస్తే.. 2025లో విడుదలైన సు ఫ్రమ్ సో సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తెలుగులో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది . ఈ సినిమా కంటే ముందు సప్త సాగరాదాచే ఎల్లో – సైడ్ బి, ఒందు మొట్టేయ కథే వంటి చిత్రాలలో నటించారు. అలా నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా మారి ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×