E-Paper
Advertisement

Ravi Basrur: 18 ఏళ్ళ వయసులో చనిపోవాలనుకున్నా.. విశ్వక్ ఒక్కడే నన్ను అలా చూశాడు.. ఎమోషనల్ అయినా రవి బస్రూర్

Ravi Basrur: 18 ఏళ్ళ వయసులో చనిపోవాలనుకున్నా.. విశ్వక్ ఒక్కడే నన్ను అలా చూశాడు.. ఎమోషనల్ అయినా రవి బస్రూర్
Advertisement

Ravi Basrur: కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన మాటల వల్ల భావోద్వేగంగా మారింది. ఈ కార్యక్రమంలో హీరో-దర్శకుడు విశ్వక్ సేన్.. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్కు రోలెక్స్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది కేవలం ఖరీదైన బహుమతి కాదు..తనపై ఉన్న గౌరవానికి గుర్తుగా ఇచ్చిన అప్రిషియేషన్ అని విశ్వక్ సేన్ తెలిపారు.

18 ఏళ్లలో చనిపోవాలనుకున్న..!

వాచ్ అందుకున్న తర్వాత రవి బస్రూర్ తన జీవితంలోని బాధాకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులో ఎదుర్కొన్న కష్టాలను అందరి ముందూ చెప్పడంతో వేదికపై భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన మాట్లాడుతూ, “18 ఏళ్ల వయసులో నేను రెండుసార్లు చనిపోవాలనుకున్నాను” అని చెప్పారు. ఆ సమయంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చేశాడని తెలిపారు. “ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. కీబోర్డ్ కొనడానికి 35 వేల రూపాయలు ఇచ్చాడు. అతని పేరు రవి” అని చెప్పారు.

Advertisement

ఆ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని రవి బస్రూర్ అన్నారు. “ఆ రోజు అతని పేరునే నా పేరుగా మార్చుకున్నాను. ఆ తర్వాత నాలోని సంగీతాన్ని గుర్తించింది విశ్వక్ సేన్ మాత్రమే” అని చెప్పారు. తన జీవితంలో ఈ ఇద్దరు ఎంతో ముఖ్యమని, “ఈ ఇద్దరిని నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని స్పష్టం చేశారు.

విశ్వక్ సేన్ ఒక్కడే..!

విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ రవి బస్రూర్ భావోద్వేగంగా ప్రశంసించారు. “నా 25 ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి ఎవరో నా Soul‌ను చూసి మెచ్చుకున్నారు. ఆ వ్యక్తి విశ్వక్ సేన్” అని అన్నారు. ఇచ్చిన రోలెక్స్ వాచ్ గురించి మాట్లాడుతూ, “ఇది వాచ్ కాదు. ఇది మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇచ్చిన అప్రిషియేషన్” అని స్పష్టంగా చెప్పారు.

Advertisement

తాను ఐదు సినిమా ఇండస్ట్రీల్లో పని చేశానని, “ఇలాంటి ఆడియన్స్‌ను ఎక్కడా చూడలేదు” అని తెలుగు ప్రేక్షకులపై ప్రేమ చూపించారు. “చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు” అని కృతజ్ఞతలు తెలిపారు.

కల్ట్ సినిమా గురించి మాట్లాడుతూ, “ఈ సినిమాలో మీరు మంత్రముగ్ధులయ్యే సౌండ్ వినబోతున్నారు. ముఖ్యంగా థియేటర్ అనుభవం మామూలుగా ఉండదు. వెయిట్ ఫర్ ఇట్” అని హామీ ఇచ్చారు. చివరగా, “విశ్వక్ సేన్ అంటే ఒక కల్ట్. ఆయనకు రెండో ఆప్షన్ లేదు” అని చెప్పారు.

ALSO READ: Cult హాలీవుడ్ సినిమా రీమేకా.. అసలు విషయం బయటపెట్టిన విశ్వక్ సేన్..!

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×