E-Paper
Advertisement

Cult హాలీవుడ్ సినిమా రీమేకా.. అసలు విషయం బయటపెట్టిన విశ్వక్ సేన్..!

Cult హాలీవుడ్ సినిమా రీమేకా.. అసలు విషయం బయటపెట్టిన విశ్వక్ సేన్..!
Advertisement

Cult: విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న రాబోయే సినిమా కల్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. గ్లింప్స్‌లో కనిపించిన ప్రమాదకరమైన గేమ్ కాన్సెప్ట్ కారణంగా, ఈ సినిమా హిట్: ది థర్డ్ కేస్ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన స్క్విడ్ గేమ్ నుంచి ప్రేరణ పొందిందా అనే సందేహాలు మొదలయ్యాయి.
హిట్ 3 సినిమాలోనూ, స్క్విడ్ గేమ్ సిరీస్‌లోనూ గేమ్ ఆధారిత సస్పెన్స్ ఉండటంతో, కల్ట్ కూడా అదే తరహా కథేనా అనే చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగింది. ఈ పోలికలపై తాజాగా విశ్వక్ సేన్ స్వయంగా స్పందించారు.

నా సొంతంగా రాసినది..!

విశ్వక్ సేన్ మాట్లాడుతూ, కల్ట్ కథను హిట్ 3 లేదా స్క్విడ్ గేమ్ చూసి రాయలేదని స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా ఆలోచన తనకు ప్రాజెక్ట్ ఎక్స్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందని తెలిపారు. కల్ట్ సినిమాకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ వస్తుందని.. ఇది పూర్తిగా తన ఆలోచనా విధానంలో నుంచే వచ్చిన కథ అని అన్నారు.
కథ ఎలా రూపుదిద్దుకుందో కూడా విశ్వక్ సేన్ వివరించారు. తన తొలి దర్శకత్వ చిత్రం ఫలక్నుమా దాస్ ఒక రీమేక్ సినిమా అవ్వగా… ఆ తర్వాత వచ్చిన దాస్ కా ధమ్కీ కథ తనకు ప్రసన్న కుమార్ నుంచి వచ్చిన ఒక ఐడియా అని తెలిపారు. కానీ కల్ట్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నమని అన్నారు. ఈ కథను తానే మొదటి నుంచి చివరి వరకు స్క్రాచ్ నుంచి రాశానని, ఇందులో ఎవరి జోక్యం లేదని స్పష్టం చేశారు.

దర్శకుడిలో మార్పు అందుకే.‌.!

Advertisement

దర్శకత్వం గురించి మాట్లాడుతూ, మొదట కల్ట్ సినిమాకు వేరే దర్శకుడిని అనుకున్నానని విశ్వక్ సేన్ తెలిపారు. కానీ కథ పెరిగే కొద్దీ ప్రతి సీన్, ప్రతి ట్విస్ట్ తన మైండ్‌లో చాలా క్లియర్‌గా ఫిక్స్ అయిపోయిందన్నారు. అందుకే చివరికి తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
కల్ట్ స్క్రీన్‌ప్లేను చాలా సమయం తీసుకుని రిఫైన్ చేశానని, సినిమా మొత్తం టెన్షన్ తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నానని విశ్వక్ సేన్ అన్నారు. బయటకు కొన్ని పోలికలు కనిపించినా, కల్ట్ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: Vishwak Sen Cult: 45 నిమిషాలు హీరో కనిపించడు.. విశ్వక్ సేన్ ‘కల్ట్’లో షాకింగ్ ట్విస్ట్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×