E-Paper
Advertisement

NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు
Advertisement

NZ vs Pak Super 8:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ సూపర్ 8 ( Super 8) స్టేజ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ 8 లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( New Zealand vs Pakistan) మధ్య కొలంబోలోని ప్రేమదాస‌ స్టేడియం ( R.Premadasa Stadium, Colombo) వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కొలంబోలో ఇవాళ సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. రిజర్వ్ డే ఆప్షన్ లేకపోవడంతో, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. దీంతో న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ కు చెరో పాయింట్ లభించింది. అయితే చెరో పాయింట్ దక్కించుకున్న పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లకు కొత్త టెన్షన్ మొదలైంది. సూపర్ 8లో మిగిలిన రెండు మ్యాచ్ ల‌లో కచ్చితంగా ఈ రెండు జట్లు గెలవాలి. లేకపోతే సెమీ ఫైనల్ అవకాశం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాకిస్తాన్, కివీస్‌ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Also Read: T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

Advertisement

 

టి20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ ముగిసిన నుంచి భారీ వర్షం పడింది. టాస్ పడిన తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ప్లేయర్లు బ్యాటింగ్ చేసేందుకు వచ్చే క్రమంలోనే వర్షం అందుకుంది. దాదాపు మూడు గంటలుగా వర్షం పడుతూనే ఉంది. చివరలో 5 ఓవర్ల మ్యాచ్ అయిన నిర్వహించాలని అంపైర్లు భావించారు. కానీ పరిస్థితి అనుకూలించడం లేదు. దీంతో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన సూపర్ 8 మ్యాచ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ డే లేకపోవడంతో చెరో పాయింట్ లభించింది.

పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు గల్లంతు

Advertisement

కొలంబోలోని ప్రేమదాస వేదికగా శనివారం జరగాల్సిన తొలి సూపర్ 8 మ్యాచ్ రద్దయింది. దీంతో పాకిస్తాన్ జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ వచ్చినప్పటికీ… సూపర్ 8 లో భాగంగా మిగిలిన రెండు మ్యాచ్ లు కచ్చితంగా గెలవాల్సిందే. శ్రీలంక అలాగే ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లతో పాకిస్తాన్ తలపడాలి. ఈ రెండు మ్యాచ్ ల‌లో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ కు సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన సెమీ ఫైనల్ ( Pakistan Semi final) ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది.  లేదా ర‌న్ రేట్ మెయింటేన్ చేసుకుంటూనే ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. అదృష్టం బాగుంటే తప్ప పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇటు ఇండియాలో సంబరాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ జట్టును వరుణుడు దెబ్బ కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బాబర్ ఆజం మాత్రం శ్రీలంకకు సంబంధించిన సీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశాడు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×