E-Paper
Advertisement

లోకేశ్ కనగరాజ్ ‘LCU’ లోకి రవి మోహన్.. నటనకు బ్రేక్ ప్రకటించిన కొద్దిరోజులకే..

లోకేశ్ కనగరాజ్ ‘LCU’ లోకి రవి మోహన్.. నటనకు బ్రేక్ ప్రకటించిన కొద్దిరోజులకే..
Advertisement

Ravi Mohan LCU: తమిళ చిత్ర పరిశ్రమలో నటుడు రవి మోహన్ చుట్టూ గత కొన్ని రోజులుగా అనేక వివాదాలు, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారం తేలేవరకు తాను సినిమాల్లో నటించనని, నటనకు విరామం ఇస్తున్నానని కొద్దిరోజుల క్రితమే రవి మోహన్ మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేసిన కొద్దిరోజులకే ఆయన అభిమానులకు ఒక ఊహించని భారీ సర్‌ప్రైజ్ లభించింది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సృష్టించిన పాపులర్ ఫ్రాంచైజీ ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లోకి రవి మోహన్ అధికారికంగా అడుగుపెట్టారు. ఎల్‌సీయూలో భాగంగా వస్తున్న ‘బెంజ్’ (Benz) చిత్రంలో ఆయన నటిస్తున్నట్లు లోకేశ్ కనగరాజ్ స్వయంగా ప్రకటించారు.

Read also-‘ధురంధర్’లో చూపించిందంతా అక్షరాలా నిజం!.. పాకిస్తానీ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు

లోకేశ్ కనగరాజ్ క్రేజీ అప్‌డేట్

Advertisement

దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా రవి మోహన్ షూటింగ్ స్పాట్ చిత్రాలను పంచుకుంటూ, ఎల్‌సీయూలోకి ఆయనకు ఘన స్వాగతం పలికారు. “వెల్‌కమ్ టు ది యూనివర్స్ రవి మోహన్ సార్” అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ కూడా రవి మోహన్‌కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. ఇంత త్వరగా రవి మోహన్ తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. “ఆయన మానసికంగా, శారీరకంగా ఇప్పుడు బాగున్నారా?” అని కొందరు, “రవి మోహన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు” అని మరికొందరు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.

వ్యక్తిగత జీవితంలో

ఇటీవలే రవి మోహన్ ప్రెస్ మీట్ పెట్టి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక క్షోభను పంచుకున్నారు. “నా విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు నేను నటించను. విడాకులు వచ్చి, నాపై జరుగుతున్న సైబర్ బుల్లీయింగ్ ఆగినప్పుడే నా జీవితం సాధారణ స్థితికి వస్తుంది, అప్పుడే నేను మళ్లీ తిరిగొస్తాను” అని ఎమోషనల్ అయ్యారు. రవి మోహన్, ఆర్తి 2009లో వివాహం చేసుకోగా, 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చెన్నై ఫ్యామిలీ కోర్టులో వీరి విడాకుల విచారణ కొనసాగుతోంది.

Advertisement

Read also-మా అమ్మ నేర్పిన పాఠం అదే.. అందుకే ఇలా మారాను: శోభితా ధూళిపాళ్ల మనసులోని మాట!

కెనీషాతో బ్రేకప్?

మరోవైపు రవి మోహన్‌కు సన్నిహితంగా ఉంటున్న ఆధ్యాత్మిక హీలర్, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఇటీవల చెన్నై వదిలి వెళ్ళిపోతున్నట్లు ప్రకటిస్తూ, రవితో బ్రేకప్ అయినట్లు హింట్ ఇచ్చారు. ఆర్తి రవిపై సోషల్ మీడియాలో జరిగిన ఒక అగౌరవకరమైన కామెంట్‌కు సైబర్ బుల్లీయింగ్ కారణమని ఆమె పేర్కొన్నారు. దీనిపై రవి మోహన్ స్పందిస్తూ, “మీరంతా కలిసి కెనీషాను దూరం చేసేశారు, ఆమె జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను” అని ప్రెస్ మీట్‌లో తెలిపారు.

‘బెంజ్’ సినిమా విశేషాలు

కార్తి ‘ఖైదీ’, కమల్ హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘లియో’ చిత్రాల తర్వాత వస్తున్న ఎల్‌సీయూ 4వ చిత్రం ‘బెంజ్’. లోకేశ్ కనగరాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా, మలయాళ స్టార్ నివిన్ పౌలీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రవి మోహన్ కూడా ఈ యూనివర్స్‌లో చేరడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×