Dhurandhar Controversy: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో దూసుకుపోయిందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరానికి చెందిన ‘ల్యారీ’ ప్రాంతాన్ని, అక్కడ నడిచే నేర ముఠాలను చూపించిన విధానంపై ఇరు దేశాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కొందరు దీనిని కేవలం సినిమా కోసం కల్పించిన కథ అని కొట్టిపారేస్తుంటే.. ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగి, అక్కడ మేయర్‌గా పనిచేసిన ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ మాత్రం ఈ సినిమాకు గట్టిగా మద్దతు పలికారు. సినిమాలో చూపించిన ప్రతి ఒక్కటి ‘అక్షరాలా నిజం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read also-ప్రెగ్నెన్సీ రూమర్లపై మాధురీ దీక్షిత్ స్ట్రాంగ్ రిప్లే.. ఇదిగో ప్రూఫ్.. మీరే లెక్కలేసుకోండి
కరాచీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, ల్యారీ ప్రాంత మాజీ మేయర్ ఆరిఫ్ ఆజాకియా ‘టాక్ జర్నలిజం’ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేదితో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ధురంధర్’ సినిమాలో ఏ కాలంలో జరిగిన కథనైతే చూపించారో.. సరిగ్గా అదే సమయంలో నేను కరాచీలోని ఆ టౌన్‌కు ఎన్నికైన మేయర్‌గా ఉన్నాను. నేను ల్యారీలోనే పుట్టి పెరిగాను. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుసు. సినిమాలో చూపించిన ప్రతి అంశం వందకు వంద శాతం నిజం,” అని ఆరిఫ్ ఆజాకియా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆరిఫ్ ఆజాకియా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు. తాను కరాచీలో పుట్టినప్పటికీ, తన తల్లిదండ్రులు గుజరాత్‌లోని జునాగఢ్‌లో జన్మించారని.. అందుకే తాను నన్ను ఒక పాకిస్తానీగా కాకుండా, ‘భారతీయ సంతతి’ వ్యక్తిగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.
Read also-సూపర్‌స్టార్ కృష్ణ జయంతి.. ‘ఎప్పటికీ నువ్వే నా హీరో’ అంటూ మహేష్ ఎమోషనల్..
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ, కొందరు విశ్లేషకులు మాత్రం దీనిపై విమర్శలు గుప్పించారు. సినిమా వాస్తవాలను పక్కన పెట్టి, కేవలం ఒక నిర్దిష్ట ఎజెండాతోనే నిర్మించారని వారు వాదించారు. అయితే, నేరుగా ల్యారీ ప్రాంతంలోనే పుట్టి, అక్కడి పరిపాలనను దగ్గరుండి చూసిన మాజీ మేయర్ ఆరిఫ్ ఆజాకియా స్వయంగా రంగంలోకి దిగి సినిమాలోని అంశాలు నిజమేనని తేల్చి చెప్పడంతో విమర్శకుల నోళ్లు మూతపడినట్లయింది.