Ravi Teja Stats New Movie Shooting: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో రవితేజ ఒకరు. మాస్ హీరోగా ఆయనకు ఉన్న ఫాలోయింగే వేరు. మాస్ మహారాజ్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత కాలంలో నటుడుగా కూడా మారిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణంలోనే నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తాను అని పూరి జగన్నాథ్ చెబుతూ ఉండేవాడట. దానిని రవితేజ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం పూరి రవితేజకు బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాడు.
బాక్సాఫీస్ వద్ద వీరి కాంబినేషన్లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు సినిమా తప్పితే అన్ని మంచి సక్సెస్ సాధించాయి. తర్వాత కాలంలో హీరోగా సినిమాలు చేస్తూ రవితేజ మంచి పేరు సంపాదించుకున్నాడు. కొంతమందికి యాంటీ ఫ్యాన్స్ ఉండడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ రవితేజ విషయానికి వస్తే అంత మంది హీరో అభిమానులు కూడా రవితేజను ఇష్టపడేవాళ్లు. కానీ రీసెంట్ టైమ్స్ లో బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు.
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఈ నెలలోనే షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో సక్సెస్ అందుకోవడం అనేది ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్. శివ నిర్మాణ చివరగా దర్శకత్వం వహించిన ఖుషి సినిమా ఊహించిన సాయి సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అవడం అనేది ఇద్దరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇప్పటికే అజనీష్ లోకనాథ్ కాంతారా, మంగళవారం వంటి సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సాధించుకున్నాడు.
రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరోల్లో మొదటి వరుసలో ఉంటాడు. ధమాకా సినిమా తర్వాత ఇప్పటివరకు ఊహించిన స్థాయిలో రవితేజ సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద స్కోర్ చేయలేదు. అయితే రవితేజ విషయంలో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అని కొంతమంది అంటుంటారు.
Also Read: SS Rajamouli: ఏంటి జక్కన్న ఇది.. ఇంట్లో వాళ్లకి కూడా చెప్పకుండా? డెడికేషన్ అంటే నీదే సామీ
కొన్ని సినిమాల్లో కూడా వాటి మీదకి ఎక్కువ దృష్టి వెళ్ళింది. ఇకపోతే రీసెంట్ గా భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన మాస్ జాతర సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాతో సక్సెస్ గ్యారంటీ అని అందరూ ఊహించరు. కానీ ఆ సినిమా కూడా రవితేజకు సక్సెస్ అందించలేకపోయింది. ఇప్పుడు శివ నిర్వణ ఏ మేరకు సక్సెస్ అందిస్తాడో చూడాలి. మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో కూడా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు రవితేజ.