Ravi Teja on Garividi Lakshmi:‘గరివిడి లక్ష్మి’ ..ఉత్తరాంద్ర కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ అయిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకోవడంతో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సినీ సెలెబ్రిటీస్.ఈ క్రమంలోనే సినిమా చూసిన రవితేజ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది అంటూ x లో పోస్ట్ వదిలారు.
ఇలాంటి సినిమాలు ఎంతో అవసరం
సినిమా కథలోని స్వచ్ఛత, ఎమోషన్స్, తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇందులో లక్ష్మి పాత్రలో నటించిన ఆనంది నటన అదిరిపోయిందని ఆకాశానికి ఎత్తేశారు. సినిమాలోని ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని .ఒక మంచి అర్థవంతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇలాంటి సినిమాలు ఎంతో అవసరమని తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు.
నిజానికి రవితేజ అంటేనే మాస్ సినిమాలకి పెట్టింది పేరు.అలాంటి రవితేజ గరివిడి లక్ష్మి వంటి ఒక ఎమోషనల్ సినిమాని చూసి బాగుంది అంటూ తనదైన అభిప్రాయాన్ని నెట్టింట పోస్ట్ చేయడం ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇక తమ అభిమాన హీరో సినిమా చూసి రివ్యూ ఇవ్వడంతో సినిమాలో అసలు ఏముందా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మాస్ మహారాజా ఫ్యాన్స్.
కథలను ప్రోత్సహించడం అభినందనీయం
ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గౌరి నాయుడు జమ్మును కూడా రవితేజ అభినందించారు. కథను చక్కగా తెరకెక్కించారని, సినిమాను ఎంతో నీట్గా హ్యాండిల్ చేశారని ప్రశంసించారు. ఈ చిత్రాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన కృతి ప్రసాద్ను కూడా రవితేజ ప్రత్యేకంగా అభినందించారు. అర్థవంతమైన సినిమాలకు మద్దతుగా నిలవడం, ప్రేక్షకుల హృదయాలను తాకే కథలను ప్రోత్సహించడం అభినందనీయమని మెచ్చుకున్నారు.
ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్
అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు సహా మొత్తం చిత్ర యూనిట్కు రవితేజ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మనసును తాకేలా ఉందని ఆయన చెప్పడం టీమ్ కి ఒక మంచి బూస్టప్ అనే చెప్పాలి.ముఖ్యంగా ఒక స్టార్ హీరో నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదు.
మొత్తానికి, ‘గరివిడి లక్ష్మి’ సినిమా చూసి రవితేజ మూవీ టీమ్ ని అభినందించడం మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఏది ఏమైనా ఆడియన్స్ ని అలరించే కథలకి ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుందనే విషయం మరోసారి రవితేజ పోస్ట్ తో మరోసారి ప్రూవ్ అయింది.చూడాలి మరి ముందు ముందు ఈ గరివిడి లక్ష్మి పై ఇంకెంత మంది తమ రియాక్షన్ ని తెలియజేస్తారో !