E-Paper
Advertisement

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ
Advertisement

Flames in France: ఫ్రాన్స్ వ్యాప్తంగా ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. నిరసన కారులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నా, ఏ మాత్రం ఆందోళనలు తగ్గడం లేదు. పారిస్, ఇతర నగరాల్లో భవనాలకు నిప్పు పెట్టడం, ఖరీదైన షాపులను దోచుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఫ్రాన్స్ వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం

వరుస ఆందోళనలతో పారిస్ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఫ్రాన్స్ ఇప్పుడు ఎటు చూసినా భయానక వాతావరణం కనిపిస్తోంది. ప్రజల నుంచి నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. ఏకంగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారంటే అక్కడ పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్‌లో పెరుగుతున్న జీవన వ్యయాలు, క్షీణిస్తున్న ప్రజా సేవలకు నిరసనగా ఆ దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.

రోడ్లపైకి వివిధ వర్గాల ప్రజలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

Advertisement

మొదలు చిన్నగా మొదలై ఆందోళనలు శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చాయి. ఫలితంగా నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటివరకు 1200 మందికి పైగా అరెస్టు చేశారు పోలీసులు. 150 మంది వరకు పోలీసు అధికారులు గాయపడ్డారు. పారిస్‌తోపాటు పలు ఇతర నగరాలకు నిరసనలు వ్యాపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా మేరకు.. దాదాపు 5 లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగినట్టు పేర్కొన్నాయి. రాజధాని పారిస్‌లో లక్షకు మందికి పైగానే నిరసనకు దిగినట్టు రాసుకొచ్చాయి.

మాస్క్‌లు ధరించి భవనాలు దగ్దం, షాపులు లూఠీ

విద్యార్థులతో ప్రారంభమైన నిరసనలు, కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు చేరాయి. సామాన్యుల విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని నిరసనకారులు మండిపడుతున్నారు. నిరసనలను పలువురు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు. మాస్కులు ధరించిన వేలాది నిరసనకారులు పోలీసులపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు భవనాలకు నిప్పు పెడుతున్నారు. ఖరీదైన షాపులను లూఠీ చేయడంతో అధికారులకు ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఆయా ఘటనలకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ALSO READ: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

దుస్తులు, ఆహార షాపులను టార్గెట్ చేస్తూ అందులోని వస్తువులను దోచుకెళ్తున్నారు. లిమోజెస్ సిటీలోని టౌన్ హాల్‌లో మంటలు చెలరేగడంతో టవర్ కూలిపోయింది. గ్రెనోబిల్ సిటీలో నిరసనకారులు ఓ టూరిస్టు ట్రైన్ పైకి దూసుకెళ్లారు. మాస్కులు పెట్టుకున్న కొందరు లక్ష్యాలను ఎంచుకుని పారిస్, మార్సియెల్, రెన్నే, టోలూస్, ఆంగర్స్ వంటి నగరాల్లో అరాచకం సృష్టిస్తున్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. దాడులు, లూటీలకు పాల్పడుతున్న వారిని వదిలేది లేదని హెచ్చరించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్.

 

 

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×