E-Paper
Advertisement

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
Advertisement

Greater Noida: గ్రేటర్ నోయిడాలో నూడిల్స్ తిని చనిపోయారని భావించిన ఐదుగురు కుటుంబ సభ్యుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మొదట ఇది ఫుడ్ పాయిజనింగ్ అనుకున్నప్పటికీ పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. విష ప్రయోగం వల్లే ఆ ఐదుగురు ప్రాణాలు విడిచినట్లు స్పష్టమైంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

అసలేం జరిగిందంటే?

నాగ్లా శ్రీ పదం గ్రామానికి చెందిన మహేష్ (37), ఆయన భార్య లలిత (35), వారి కుమార్తె మిష్టి (7), కుమారులు లడ్డు (11), సాక్షాత్ (3) శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తమ గదిలో విగతజీవులుగా కనిపించారు. అయితే శుక్రవారం సాయంత్రం ఆ కుటుంబం.. స్థానిక జాతరకు వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రాత్రి వారు నూడిల్స్ తిన్నారు. దీంతో ఫుడ్ పాయిజనింగ్ వల్లే చనిపోయారని అందరూ భావించారు.

విషప్రయోగమే కారణం!

Advertisement

అయితే మహేష్ స్వయంగా ఆ నూడిల్స్ లో విషం కలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయన ఫోన్ నుండి ఒక ఆడియో నోట్ కూడా లభించింది. తన చావుకు తన ఇద్దరు సోదరీమణులు, బావనే కారణమని ఆ ఆడియోలో మహేష్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు మహేష్ సోదరీమణులతో, బావను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఆస్తి తగాదాలే వల్లేనా?

Advertisement

కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని మృతుడి బంధువులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆహార భద్రతా అధికారులు ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదని తేల్చి చెప్పారు. ఘటనా స్థలంలో లభించిన ఆహార పదార్థాలు, ప్యాకెట్లను పరిశీలించగా ఎలాంటి గడువు ముగిసిన వస్తువులు లభించలేదని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఓపీ సింగ్ తెలిపారు. చనిపోవడానికి ముందు బాధితుల్లో ఎవరికీ వాంతులు, విరేచనాల లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు.

Also Read: అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

Tags

Related News

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

Big Stories

Advertisement
×