E-Paper
Advertisement

Raviteja ‘RT 77’: రూట్ మార్చిన రవితేజ.. కొత్త సినిమా టైటిల్ రిలీజ్.. సక్సెస్ అవుతారా?

Raviteja ‘RT 77’: రూట్ మార్చిన రవితేజ.. కొత్త సినిమా టైటిల్ రిలీజ్.. సక్సెస్ అవుతారా?
Advertisement

Raviteja ‘RT 77’:మాస్ మహారాజా రవితేజ (Raviteja ) గత కొంతకాలంగా హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘RT 77’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైంది. ‘మజిలీ’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివా నిర్వాణ (Siva nirvana) దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతాన్ని అందిస్తున్నారు.

RT 77 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్..

ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రిపబ్లిక్ డే అలాగే మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. అటు ఇంస్టాగ్రామ్ ఇటు ఎక్స్ వేదికగా పంచుకున్న ఈ పోస్టర్ అభిమానులలో అంచనాలు పెంచుతుంది. రవితేజ, శివ నిర్మాణ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఇందులో అయ్యప్ప మాల ధరించిన రవితేజ ఒక పాపను ఎత్తుకొని చుట్టూ అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు .ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. దైవత్వంతో కూడుకున్న కథలా ఉంది అని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

Advertisement

ALSO READ:Murali Sharma: గరికపాటి వ్యాఖ్యలు తప్పే.. సంచలనం రేపిన అనసూయ ఫ్యాన్!

ఎమోషన్స్ తో పాటు రివేంజ్ డ్రామాగా..

ఫాదర్ సెంటిమెంట్ , పాప ఎమోషన్స్ తో పాటు బలమైన యాక్షన్ రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇకపోతే తన రెగ్యులర్ లవ్ జానర్ వదిలిపెట్టి శివ నిర్వాణతో కొత్తగా ట్రై చేస్తున్నారు రవితేజ. అంతేకాదు ఇన్నేళ్ల తన సినీ కెరియర్ లో తొలిసారి ఇలాంటి పాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. మరి సక్సెస్ కోసం యూటర్న్ తీసుకున్న రవితేజ ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికైతే టీం నుంచి ఈ సినిమా టైటిల్ రివీల్ పోస్టరు అఫీషియల్ గా విడుదలయ్యింది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.

రూట్ మార్చిన రవితేజ.. బ్లాక్ బస్టర్ అందుకుంటారా?

Advertisement

ఇదిలా ఉండదా గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు రవితేజ. ఇప్పటికే ఆయన తర్వాత వచ్చిన యంగ్ హీరోలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంటే.. రవితేజ మాత్రం ఈ మధ్యకాలంలో అలాంటి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకోలేదు. చివరిగా ధమాకా తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈయన.. ఇప్పుడు ఈ ఇరుముడి చిత్రంతో ఆ రేంజ్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికైతే బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం రూట్ మార్చుకున్న రవితేజకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×