E-Paper
Advertisement

Murali Sharma: గరికపాటి వ్యాఖ్యలు తప్పే.. సంచలనం రేపిన అనసూయ ఫ్యాన్!

Murali Sharma: గరికపాటి వ్యాఖ్యలు తప్పే.. సంచలనం రేపిన అనసూయ ఫ్యాన్!
Advertisement

Murali Sharma:మురళీ శర్మ (Murali Sharma) .. గత కొంతకాలంగా ప్రముఖ యాంకర్, నటీమణి అనసూయ (Anasuya ) ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై పలు కామెంట్లు చేస్తూ తెగ వైరల్ అయిపోతున్నారు. ఇక నిన్నటికి నిన్న తమ అభిమాన నటీమణి అనసూయకి గుడి కడతామని.. కుష్బూ , సమంత, హన్సిక లాంటి హీరోయిన్లకు ఎలా అయితే గుడి ఉందో.. త్వరలోనే అనసూయకి కూడా గుడి కడతామని కామెంట్లు చేశారు. అంతేకాదు అభిమానులందరితో చర్చించి ఆ గుడి ఎక్కడ కట్టాలి ? అనే విషయంపై చర్చిస్తాము అంటూ కామెంట్లు చేశారు. అక్కడితో ఆగకుండా అనసూయకి పూజ చేయడానికి ప్రత్యేకంగా పూజారి అవసరం లేదు అని.. ప్రేమగా ఒక గులాబీ ఆమె విగ్రహం ముందు పెడితే చాలు అంటూ సంచలనం రేపిన విషయం తెలిసిందే.

గరికపాటి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మురళీ శర్మ..

అలాంటి ఈయన ఇప్పుడు ఏకంగా గరికపాటి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ముఖ్యంగా ప్రవచనకర్త గరికపాటి పై కామెంట్లు చేయడంతో చాలామంది నెటిజన్స్ మండిపడుతున్నారు. పైగా ఈయన చేసిన కామెంట్లను ట్రోల్స్ చేస్తూ.. మీమ్స్ వేస్తూ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. మురళీ శర్మ మాట్లాడుతూ..” గరికపాటి గారు ఆడవారు వేసుకునే నైటీల గురించి మాట్లాడడం పొరపాటే. ఆయన అలా మాట్లాడకూడదు. ఆయన చివరికి అలాంటి మాటలు కూడా మాట్లాడారు. అది పూర్తిగా తప్పు” అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇది చూసిన చాలామంది గరికపాటి వ్యాఖ్యలనే తప్పు పడుతున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఇతని వ్యాఖ్యలపై మండిపడుతూ వీడెవర్రా.. ఎక్కడ నుంచి వచ్చాడు..అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అర్ధరాత్రి.. ఆడవారు.. స్వతంత్రం.. మురళీ శర్మ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఫైర్..

Advertisement

ఇక్కడ హైలెట్ ఏమిటంటే.. మహాత్మా గాంధీ చెప్పిన అర్థరాత్రి ఆడవారి స్వతంత్రం గురించి చెప్పి.. అటు హోస్ట్ కే కాదు ఇటు చూసేవారికి కూడా మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాడని చెప్పవచ్చు . అనసూయ అభిమానిగా చెప్పుకుంటున్న ఈ మురళీ శర్మ ఇప్పుడు వార్తల్లో నిలవడానికి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని కొంతమంది నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై అనసూయ ఏదైనా స్పందిస్తుందా లేక ఇతను ఎవరో తనకు తెలియదన్నట్టుగా సైలెంట్ అవుతుందా అంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా మురళీ శర్మ గరికపాటిపై చేసిన కామెంట్లు మాత్రం ఆయన అభిమానులకు కోపాన్ని తెప్పిస్తోంది అనడంలో సందేహం లేదు.

ALSO READ:Anil Ravipudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ స్టోరీ.. ఆ సినిమానే – అనిల్

పబ్లిసిటీ కోసమేనా?

Advertisement

నిజానికి ఇలాంటి కొంతమంది పబ్లిసిటీ పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్స్ తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మురళీ శర్మ అనే వ్యక్తి నిజంగానే అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడా లేక పాపులారిటీ కోసం ఇలా సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడానికి ట్రై చేస్తున్నాడా అన్న విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×