E-Paper
Advertisement

Ravi Teja New Movie : శివ నిర్వాణకి అలవాటు లేని పని.. పోయి పోయి రవితేజపైనే చేయాలా?

Ravi Teja New Movie : శివ నిర్వాణకి అలవాటు లేని పని.. పోయి పోయి రవితేజపైనే చేయాలా?

Ravi Teja Siva Nirvana Movie : శివ నిర్వాణ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. నాని హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘నిన్ను కోరి’ తో దర్శకుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే సమంత- నాగ చైతన్య కాంబినేషన్లో ‘మజిలీ’ అనే సూపర్ హిట్ సినిమా చేశారు. ఆ టైంకి ఇది నాగ చైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే శివకి అదే బ్యానర్లో ‘టక్ జగదీష్’ వంటి మాస్ సినిమా చేసే అవకాశం దక్కింది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీకే పరిమితమైంది ‘టక్ జగదీష్’. ఆ సినిమాకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. శివ నిర్వాణ కెరీర్ పై ఎటువంటి ప్రభావం పడలేదు.

పైగా ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అది కూడా విజయ్ దేవరకొండ వంటి పెద్ద హీరోతో. అలా ‘మైత్రి’ బ్యానర్లో శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’ సినిమాలో కూడా హీరోయిన్ గా సమంత నటించింది. ఇది కూడా ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది. 2023 లో ‘ఖుషి’ విడుదలైంది. దాదాపు 2 ఏళ్ళు పూర్తికావస్తున్నా అతని నుండి మరో సినిమా రాలేదు. కానీ శివ వద్ద ‘మైత్రి..’ వారి అడ్వాన్స్ ఉంది. కాబట్టి.. నెక్స్ట్ సినిమాని కూడా ఇదే బ్యానర్లో చేయాలి. మరోవైపు నాగ చైతన్య వద్ద కూడా ‘మైత్రి..’ వారి అడ్వాన్స్ ఉంది. దీంతో అతని 25వ సినిమాని ఈ బ్యానర్లో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ కారణాలు ఏంటో తెలీదు కానీ ఈ ప్రాజెక్టు నుండి నాగ చైతన్య తప్పుకున్నాడు. రవితేజ ఎంట్రీ ఇచ్చాడు.

అవును శివ నిర్వాణ- రవితేజ కలయికలో ఓ క్రేజీ సినిమా రూపొందనుంది. ‘మైత్రి..’ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో సమంతని హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ సమంత ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పలేదు అని తెలుస్తుంది. దీంతో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు సమాచారం. ఇది ఒక థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న సినిమా అని టాక్. జోనర్ గురించి తెలియగానే చాలా మంది షాక్ అవుతున్నారు. అందుకు కారణం దర్శకుడు శివ నిర్వాణ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటివరకు శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమాలు అన్నీ ప్రేమ కథలే. పైగా అవి కూడా చాలా వరకు మణిరత్నం పాత హిట్ సినిమాలని పోలి ఉంటాయనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది.ఈ విషయంలో శివ నిర్వాణ పై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ శివ నిర్వాణ మాత్రం తాను మణిరత్నం హార్డ్ కోర్ ఫ్యాన్ అవ్వడం వల్ల.. అతని సినిమాల స్పూర్తితో కథలు రాసుకుంటాను అని చెప్పి కవర్ చేశాడు. ‘ఖుషి’ తో అతను కూడా రియలైజ్ అయినట్టు ఉన్నాడు. అందుకే థ్రిల్లర్ జోనర్ కి షిఫ్ట్ అయ్యాడు. కాకపోతే ప్లాపుల్లో ఉన్న రవితేజతో అలవాటు లేని జోనర్లో సినిమా తీస్తున్నాడు.. మరి ఫలితం ఎలా ఉంటుందో దేవుడికే తెలియాలి.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×