E-Paper
Advertisement

T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే
Advertisement
T20 World Cup 2026 Schedule:  క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ మార్చి 8వ తేదీ 2026 వరకు కొనసాగరం ఉంది. అంటే దాదాపు 30 రోజుల పాటు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. తొలి మ్యాచ్ పాకిస్తాన్‌, నెద‌ర్లాండ్స్ మ‌ధ్య కొలంబో వేద‌కగా జ‌రుగ‌నుంది. మార్చి 8వ తేదీ ఫైన‌ల్స్ ఉంటుంది.

20 జట్లతో టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 Schedule) మొత్తం 20 జట్లతో నిర్వహించబోతున్నారు. ఈ 20 జ‌ట్ల‌ను 4 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూప్ లో 5 జ‌ట్లు ఉండ‌నున్నాయి. ఈ టీ 20 వరల్డ్ కప్ ఇండియాతో పాటు శ్రీలంక వేదికగా జరగనుంది. ఇండియాలో ఉన్న ప్రముఖ నరేంద్ర మోడీ స్టేడియంలో వ‌ర‌ల్డ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ కు వస్తే కొలంబో వేదికగా టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక  తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోల్ క‌తా వేదిక‌గా జ‌రుగ‌నుంది. ఒక‌వేళ పాకిస్తాన్ ఆ మ్యాచ్ కు క్వాలిఫై అయితే, కొలంబో వేదిక‌గా నిర్వ‌హిస్తారు. రెండో సెమీస్ ముంబైలోకి వాంఖ‌డే వేదిక‌గా జ‌రుగ‌నుంది.

2026 T20 ప్రపంచ కప్ కోసం 5 గ్రూప్ లు

గ్రూప్ 1: భారతదేశం, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, USA

Advertisement

గ్రూప్ 2: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్, ఐర్లాండ్

గ్రూప్ 3: ఇంగ్లాండ్, WI, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ

Advertisement

గ్రూప్ 4: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, కెనడా

పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మ‌రోసారి పాకిస్తాన్‌, టీమిండియా రెండు జ‌ట్లు కూడా ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఈ త‌రుణంలోనే పాకిస్తాన్‌, టీమిండియా మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన కొలంబో వేదిక‌గా జ‌రుగ‌నుంది. రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితుల నేప‌థ్యంలో భార‌త్ లో పాకిస్తాన్ ప‌ర్య‌టించ‌బోదు. ఈ టోర్న‌మెంట్ లో పాకిస్తాన్ ఆడే, ప్ర‌తీ మ్యాచ్ కూడా శ్రీలంక‌లోని కొలంబో వేదిక‌గా జ‌రుగ‌నుంది.

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ జరిగే వేదికలు

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ వేదికల వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. ఢిల్లీ లోని అరుణ్ జెట్లీ, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం, ముంబైలోని వాన్ కడియం స్టేడియం వేదికగా మ్యాచులు జరుగుతాయి. శ్రీలంకలో మొత్తం మూడు గ్రౌండ్ లను ఫైనల్ చేశారు. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ప్రేమ దాస అలాగే కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ లో జ‌రుగ‌నున్నాయి.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×