E-Paper
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi Song : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. భీమ్స్ మరో మాస్ బీట్

Bhartha Mahasayulaku Wignyapthi Song : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. భీమ్స్ మరో మాస్ బీట్
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi Song : ధమాకా సినిమా తర్వాత ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయాయి.. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మాస్ జాతర సినిమా కూడా డిజాస్టర్ టాక్ సాధించుకుంది. రైటర్ గా మంచి పేరు సాధించుకున్న భాను దర్శకుడుగా మాస్ జాతర సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు . రవితేజకు పెద్దగా హిట్టు ప్లాప్ తో సంబంధం ఉండదు కాబట్టి వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు.

మొన్న మాస్ జాతర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రవితేజ మరియు భీమ్స్ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో రవితేజ చేస్తున్న అన్ని సినిమాలకు తనే మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరో మాస్ బీట్

Advertisement

మొత్తానికి రవితేజ కోసం మరో మాస్ బీట్ సాంగ్ రెడీ చేశాడు భీమ్స్ ఈ సినిమా నుంచి కొద్దిసేపటికి బెల్లా బెల్లా అనే సాంగ్ విడుదలైంది. ఆసికా రంగనాథ్ మరియు రవితేజ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. అలానే డింపుల్ హయాతి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అయితే విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతానికి బానే ఆకట్టుకుంటుంది. భీమ్స్ మరోసారి రవితేజ కోసం ఒక మాస్ బీట్ రెడీ చేశాడు. ఈ పాటను సురేష్ గంగుల రాశాడు.

అయితే ఈ లిరికల్ వీడియోలో రవితేజ పర్ఫామెన్స్ కూడా మంచి వైబ్ క్రియేట్ చేస్తుంది. కిషోర్ తిరుమల కి కూడా హిట్ సినిమా రావడం అనేది చాలా అవసరం. తను రామ్ పోతినేని హీరోగా తీసిన రెడ్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఇక కిషోర్ అంచనాలన్నీ కూడా భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మీద ఉన్నాయి.

Advertisement

రవితేజకు కం బ్యాక్ అవసరం 

ఈ మధ్యకాలంలో రవితేజ చేసిన ఏ సినిమాలు కూడా ఊహించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోతున్నాయి. అయితే రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ మీద విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్స్ గురించి ఎప్పుడు టాపిక్స్ నడుస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాకి దాన్ని కిషోర్ తిరుమల ఓవర్ కం చేశాడో లేదో చూడాలి.

భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అయితే ఆల్రెడీ సంక్రాంతికి చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా ఆ టైం కి వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి సాంగ్ విడిచిపెట్టి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు.

Also Read: Vamshi Paidipally : లాంగ్ గ్యాప్ తర్వాత ఆ బాలీవుడ్ హీరో సెట్ అయ్యాడు, అఫీషియల్ కన్ఫర్మేషన్

Related News

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

Big Stories

Advertisement
×