E-Paper
Advertisement

Vamshi Paidipally : లాంగ్ గ్యాప్ తర్వాత ఆ బాలీవుడ్ హీరో సెట్ అయ్యాడు, అఫీషియల్ కన్ఫర్మేషన్

Vamshi Paidipally : లాంగ్ గ్యాప్ తర్వాత ఆ బాలీవుడ్ హీరో సెట్ అయ్యాడు, అఫీషియల్ కన్ఫర్మేషన్
Advertisement

Vamshi Paidipally : ప్రభాస్ నటించిన మున్నా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఆ తర్వాత బృందావనం సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత ఎవడు సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. నాగార్జున కార్తీ కలిసి నటించిన ఊపిరి కూడా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక మహేష్ బాబు కెరియర్ లో 25వ సినిమాగా వచ్చిన మహర్షి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

మున్నా సినిమా మినహాయిస్తే వంశీ పైడిపల్లి కెరీర్లో అన్ని సూపర్ సక్సెస్ఫుల్ సినిమా లు ఉన్నాయి. వారసుడు సినిమాతో చివరిసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు వంశీ. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వర్కౌట్ అయింది. వారసుడు సినిమా తర్వాత ఇప్పటివరకు వంశీ పైడిపల్లి ఒక సినిమా కూడా చేయలేదు. చాలామంది స్టార్ హీరోలతో వంశీ పైడిపల్లి సినిమా వస్తుంది అని వార్తలు వినిపించాయి తప్ప అధికారక ప్రకటన రాలేదు.

సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్ట్ 

Advertisement

మొత్తానికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. దీని గురించి అధికారక ప్రకటన కూడా త్వరలో వస్తుంది. మొత్తానికి తెలుగు సినిమా హీరోలు ఎవరు వంశీ పైడిపల్లితో చేయకపోయినా కూడా ఇతర భాషల్లో ఉన్న స్టార్ హీరోలను సెట్ చేసుకొని ప్రాజెక్టులు చేస్తున్నాడు వంశీ.

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అటువంటి విజయ్ ను వంశీ పైడిపల్లి కోసం సెట్ చేశాడు దిల్ రాజు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో చేయబోయే ప్రాజెక్ట్ పైన కూడా చాలామందికి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా 2026లో మొదలుకానున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

బ్యానర్ కం బ్యాక్ 

Advertisement

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది టాలెంటెడ్ దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి ఉంది. సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ వంటి ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఈ బ్యానర్స్ లో అద్భుతమైన సక్సెస్ లో అందుకున్నారు. వంశీ పైడిపల్లి కూడా ఇప్పటివరకు ఈ బ్యానర్ బయటకు వచ్చి ఒక సినిమా కూడా చేయలేదు. ఇక సల్మాన్ ఖాన్ తో చేయబోయే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. 2026 లో ఈ బ్యానర్ కం బ్యాక్ ఇవ్వబోతుంది అని అర్థమవుతుంది.

Also Read : Raju Weds Rambai : చిన్న సినిమా సెన్సేషనల్ గ్రాస్, దర్శక నిర్మాతల ఆలోచన మారాలి

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×