Ravi Babu: రవిబాబు పరిచయం అవసరం లేని పేరు ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఎన్నో సినిమాలలో కమెడియన్ గా విలన్ గా నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక రవిబాబు తాజాగా దర్శకత్వం వహించిన రేజర్(Razor) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మే 8వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోల యాక్షన్ సన్నివేశాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొన్ని కఠినమైన సన్నివేశాల కోసం డూప్స్(Dupes) ను ఉపయోగిస్తుంటారు . అయితే తాజాగా ఇలా హీరోలు డూప్స్ వాడటం గురించి ఈయన మాట్లాడుతూ.. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో 90 శాతం మంది హీరోలు డూప్స్ సహాయంతోనే యాక్షన్స్ సన్ని వేషాలు చేస్తున్నారని తెలిపారు. మన దగ్గర వాస్తవానికి దగ్గరగా ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు లేవని, మన సినిమాలలో లాజిక్కులు ఉండవని తెలిపారు. ఇక మనవారికి కావలసినంత సమయం డబ్బు ఇస్తే ఎలాంటి ఎదవ అయినా సినిమా చేయగలడని రవిబాబు తెలిపారు.
ఇక సినిమాలో లీక్ అవ్వడం గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఒకప్పుడు సినిమా విడుదల అయ్యే వరకు ఎలా ఉంటుందనే విషయాలు కూడా తెలిసేది కాదు ఒకప్పుడు సినిమా చాలా మిస్టరీగా ఉండేది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అంటూ విడుదల కాకుండానే సినిమా బయటకు వస్తుందని తెలిపారు. అలాగే ఒకప్పుడు సినిమాలలో నటీనటులను చూడాలి అంటే కేవలం మద్రాస్ లో షూటింగ్ జరిగేటప్పుడు మాత్రమే చూసే అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం మాత్రం పబ్లిసిటీ పేరుతో ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ప్రేక్షకులకు కూడా ఆసక్తి లేకుండా పోతుందని ఈయన సోషల్ మీడియా గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎలాంటి డూప్స్ వాడలేదు..
ఇక ఈయన డైరెక్షన్లో వచ్చిన రేజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మే ఎనిమిదో తేదీ విడుదలవుతోంది ఈ సినిమాలో తనీష్, బెనర్జీ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు ఫ్లయింగ్ ఫ్రాక్స్ ప్రొడక్షన్ నిర్మాణంలో భాగంగా సురేష్ బాబు సమర్పకుడిగా కొనసాగారు. అయితే ఈ సినిమాలో ఏ విధమైనటువంటి డూప్ లేకుండా చాలా నేచురల్ గా ఫైట్ సన్నివేశాలను రూపొందించినట్లు రవిబాబు తెలియజేశారు. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోలందరూ కూడా డూప్స్ ఉంటేనే సెట్ లోకి అడుఅడుగుపెడతారంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ పై జే.డి చక్రవర్తి కామెంట్స్… అబ్బాయిలు బాధితులే అంటూ!