E-Paper
Advertisement

యూఏఈ షాకింగ్ నిర్ణయం.. ఒపెక్, ఒపెక్+ ల నుంచి బయటకు!

యూఏఈ షాకింగ్ నిర్ణయం.. ఒపెక్, ఒపెక్+ ల నుంచి బయటకు!
Advertisement

UAE Leaves OPEC: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), ఒపెక్+ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ యుద్ధం ఇంధన సంక్షోభానికి దారితీసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడంతో యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని WAM వార్తా సంస్థ ప్రకటించింది. ఈ చర్య యూఏఈ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆర్థిక విషయాలను అనుగుణంగా ఉందని వీఏఎమ్ పేర్కొంది.

దేశ ప్రయోజనాల కోసం

ప్రపంచ ఇంధన మార్కెట్లలో కీలకమైన పాత్ర కొనసాగిస్తూనే, దేశీయంగా ఇంధన ఉత్పత్తిని విస్తరించడంపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని యూఏఐ తెలిపింది. “ఈ నిర్ణయం యూఏఈ దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆర్థిక ప్రాధాన్యత, దేశీయ ఇంధన ఉత్పత్తిలో వేగవంతమైన పెట్టుబడులు, దేశాభివృద్ధికి అవసరమయ్యే ఇంధన స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రపంచ ఇంధన మార్కెట్లలో బాధ్యతాయుతమైన, విశ్వసనీయమైన, ముందుచూపుతో కీలక పాత్ర పోషించేందుకు తమ నిబద్ధతను పాటిస్తామని” యూఏఈ పేర్కొంది.

బాధ్యతాయుతంగానే

Advertisement

ఒపెక్, ఒపెన్+ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువస్తామని పేర్కొంది. ఇరాన్ మద్దతుదారులైన హౌతీ తిరుగుబాటుదారులతో యెమెన్ దాడులు, పలు ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యలపై యూఏఈ, సౌదీ అరేబియా మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం ప్రకటించింది.

Also Read:  అమెరికా చేసిన పాపం.. దుబాయ్‌కి శాపం.. యూఏఈపై ఇరాన్ రివేంజ్‌కు కారణాలివే!

ఒపెక్ బలహీనం

Advertisement

ఒపెక్ లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్‌ ఏర్పడిన ఏడేళ్ల తర్వాత 1967లో యూఏఈ ఈ గ్రూప్ లో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్‌ తర్వాత మూడో అతిపెద్ద చముురు ఎగుమతిదారుగా యూఏఈ ఉంది. ఒపెక్‌ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ.. సుదీర్ఘకాలం సభ్యదేశంగా కొనసాగింది. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా రాజకీయ పరిస్థితులతో యూఏఈ కీలక నిర్ణయం తీసుతుంది. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలు సరిగ్గా స్పందించలేదని యూఏఈ ఆరోపిస్తుంది. ఒపెక్‌ నుంచి యూఏఈ బయటకు రావడంతో.. ఒపెక్‌ బలహీనపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×