J.D.Chakravarthy: జెడి చక్రవర్తి పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన జె.డి చక్రవర్తి (JD Chakravarthy)ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈయన తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం(Gaayapadda Simham) సినిమాలో కూడ నటిస్తున్నారు. ఈ సినిమా మే 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో జెడి చక్రవర్తి వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈయన ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమో వీడియోలో భాగంగా జెడి చక్రవర్తి తన కెరీర్ గురించి అలాగే తన గురించి వచ్చిన రూమర్ల పట్ల కూడా స్పందించారు. జె.డి చక్రవర్తి నటి విష్ణు ప్రియను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటికే ఈయన క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ అంశం గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కనీసం నాకు పెళ్లి జరిగిన విషయాన్ని నాకైనా చెప్పండి అంటూ పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా హీరోయిన్ మహేశ్వరి త గతంలో వచ్చిన వార్తలపై కూడా స్పందించారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎంతోమంది హీరోయిన్లు ఇలా క్యా స్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం అమ్మాయిలకు మాత్రమే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని అందరూ భావిస్తారు కానీ ఈ ఇంటర్వ్యూలో భాగంగా జెడి చక్రవర్తి మాట్లాడుతూ అబ్బాయిలకు కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో తనకున్నటువంటి అనుబంధం గురించి కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జెడి చక్రవర్తి ప్రస్తావించారని తెలుస్తోంది. ఆయనకు తెలిసినని విషయాలు మరెవరికి తెలియవు అంటూ జెడి చక్రవర్తి తెలియజేశారు.
ముద్దు సీన్లపై చక్రవర్తి హాట్ కామెంట్స్..
ఇక సినిమా ఇండస్ట్రీలో లిప్ కిస్, ముద్దు సీన్ల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను గ్లాస్ పెట్టుకొని ముద్దు పెట్టుకోవడం నేర్చుకున్నాను అంటూ ఈయన సరదాగా మాట్లాడారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి, ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించారని తెలుస్తుంది.. ఈయన ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలియజేశారనేది తెలియాలి అంటే పూర్తి ఇంటర్వ్యూ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.
Also Read: పెళ్లి పై తరుణ్ భాస్కర్ కామెంట్స్..త్వరలోనే పప్పన్నం పెట్టనున్నారా?