E-Paper
Advertisement

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!
Advertisement

Irumudi Movie: రవితేజ ఇరుముడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో అరుదైన ఘనత సాధించింది. రవితేజ (Raviteja)ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరో హీరోయిన్లుగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “ఇరుముడి”(Irumudi). ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సూపర్ సక్సెస్ అందుకుంది. ఆగస్టు 21వ తేదీ విడుదలైన ఈ సినిమా కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాతలు అధికారకంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు.

200 కోట్లు కొల్లగొట్టిన ఇరుముడి..

ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలో అయ్యప్ప స్వామి గెటప్ లో మనెమ్మ కనిపించగా ఇరువైపులా రవితేజ ప్రియా భవాని శంకర్ నిలబడి ఉన్నటువంటి పోస్టర్ ను విడుదల చేస్తూ అన్ని థియేటర్లలో ఇరుముడి సంబరాలు కొనసాగుతున్నాయని, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా అందరూ సినిమాను ఆదరిస్తున్నారనీ, ఇరుముడి జనరేషన్ బ్లాక్ బాస్టర్ సినిమా అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు పోస్టర్ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రవితేజ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్..

Advertisement

రవితేజ ఇప్పటివరకు సుమారు 70కి పైగా సినిమాలలో నటించారు అయితే తన సినీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా ఇరుముడి నిలిచిపోతుందని చెప్పాలి. ఇటీవల కాలంలో రవితేజ నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సంగతి తెలిసిందే. ధమాకా సినిమాతో సక్సెస్ అందుకున్న రవితేజ అనంతరం ఒక అరడజనుకు పైగా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రతి ఒక్క సినిమా కూడా నిరాశపరిచింది. ఇలా రవితేజ సినిమాల విషయంలో పూర్తిగా నిరాశలో ఉన్న అభిమానులకు ఇరుముడి అభిమానుల ఆకలిని తీర్చిందని చెప్పాలి.

Advertisement

ఈ సినిమా డివోషనల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దర్శకుడు శివ నిర్వాణ(Siva Nirvana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి పది రోజులు అవుతున్న ఇప్పటికీ ఏమాత్రం కలెక్షన్లు తగ్గుకుండా దూసుకుపోతుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రవితేజ తన తదుపరి పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తూ సరైన కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే రవితేజను కలుస్తూ పలు కథలను వినిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా బేబీ నక్షత్ర (Baby Nakshatra)కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈమెకు తెలుగు తమిళ భాషలలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి.

Also Read: పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×