E-Paper
Advertisement

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్
Advertisement

Survival Thriller on OTT : ప్రపంచానికి తెలియని ఓ భయంకరమైన రహస్యం దాగి ఉన్న లోతైన అగాధం… దానికి ఎదురెదురుగా రెండు టవర్లలో ఒంటరిగా కాపలా కాసే ఇద్దరు ఎలైట్ ఆపరేటివ్స్. ఏడాది పాటు అక్కడి నుంచి కదలకూడదు, అగాధంలోకి దిగకూడదు, అసలు లోపల ఏం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. కానీ ఆ నిషేధిత ప్రాంతంలో దాగి ఉన్న ప్రమాదం ఒక్కసారిగా బయటకు వస్తే ? తమ ప్రాణాలకే ముప్పు వచ్చినప్పుడు ఈ ఇద్దరూ ఆ అగాధంలోకి దిగాల్సి వస్తే ? ఇలాంటి సై-ఫై, యాక్షన్, హారర్, రొమాన్స్ అంశాలను కలిపిన తెరకెక్కించిన డిఫరెంట్ థ్రిల్లర్ ‘The Gorge’. మరి ఆ అగాధంలో అసలు ఏం దాగి ఉంది ? ఇద్దరు ఆపరేటివ్స్ ఎందుకు ప్రాణాలకు తెగించాల్సి వచ్చింది ? అనే కథపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

లెవి ఓ మాజీ మెరైన్, మంచి నైపుణ్యం కలిగిన, శిక్షణ పొందిన స్నైపర్. అతన్ని ఓ అత్యంత రహస్య మిషన్ కోసం ఎంపిక చేస్తారు. ప్రపంచానికి తెలియని ఓ భారీ గార్జ్‌ కు పశ్చిమ వైపున్న టవర్‌ లో ఏడాది పాటు కాపలా కాయాలి. అదే సమయంలో మరో టవర్‌ లో డ్రాసా అనే ఎలైట్ ఆపరేటివ్ ఉంటుంది. ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నప్పటికీ నేరుగా కలవకూడదు. వాళ్ల అసలు పని అగాధం నుంచి ఏదీ బయటకు రాకుండా చూడటమే. మొదట ఇద్దరూ దూరం నుంచే సంకేతాల ద్వారా మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకుంటారు. ఆ పరిచయం క్రమంగా అనుబంధంగా మారుతుంది.

Advertisement

కానీ గార్జ్‌ లో దాగి ఉన్న అసలు ప్రమాదం బయట పడటంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు తమకు చెప్పిన మిషన్ వెనుక మరొక పెద్ద రహస్యం ఉందని ఇద్దరికీ అర్థమవుతుంది. ఇక ప్రాణాలు దక్కించుకోవాలంటే వాళ్లు తమ టవర్లను వదిలి అగాధంలోకి దిగాల్సిందే. లోపల ఎదురయ్యే భయంకరమైన జీవులు, ప్రమాదకరమైన ప్రాంతాలు, ఊహించని పరిస్థితులు వాళ్ల సామర్థ్యానికి అసలు పరీక్ష పెడతాయి. అసలు ఈ గార్జ్‌ ను ఎందుకు రహస్యంగా ఉంచారు ? లోపల ఉన్న శక్తి ఏంటి ? లెవి, డ్రాసా దాని నుంచి బయటపడతారా ? అనేదే ఈ సినిమాలోని అసలు థ్రిల్.

Also Read : ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడ ?

Advertisement

స్కాట్ డెరిక్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మైల్స్ టెల్లర్, అన్యా టేలర్-జాయ్, సిగోర్నీ వీవర్, సోప్ డిరిసు తదితరులు నటించారు. సినిమా రన్‌టైమ్ 2 గంటల 7 నిమిషాలు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సెట్పీసులు, సైన్స్ ఫిక్షన్, హారర్ కలయికతో తెరకెక్కింది. 100 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ‘ది గోర్గ్’ సినిమా ప్రస్తుతం Apple TV+లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ లిస్టింగ్‌లో తెలుగు ఆడియో లేదు. అయితే తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంగ్షీషుతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఆడియో ఉంది. సై-ఫై, మాన్‌స్టర్ హారర్, యాక్షన్, సర్వైవల్, రొమాన్స్ కలిసిన డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూడాలి అనుకుంటున్నారా ? అయితే ఈ సినిమా మంచి రోలర్‌కోస్టర్ రైడ్ అవుతుంది.

Tags

Related News

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×