E-Paper
Advertisement

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!
Advertisement

Actress Sireesha: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు రెండో పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఒకానొక సమయంలో విడాకుల కల్చర్ నార్త్ ఇండియాలో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా విడాకుల కల్చర్ పెరిగిపోయింది. వివాహమైనప్పటికీ వైవాహిక బంధం ఎదురవుతున్న ఒడిదుడుకుల కారణంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోయి తదుపరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన బుల్లితెర నటి శిరీష(Sireesha) మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే.

రెండో పెళ్లి విమర్శలపై శిరీష ఫైర్..

శిరీష నటుడు, యాంకర్ కం ఆర్ జే మహేంద్ర (Mahendra)తో కలిసి పెళ్లి పీటలెక్కారు. ఇటీవల వీరి వివాహం సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక శిరీషకి ఇది రెండో వివాహం కావడంతో సోషల్ మీడియా వేదికగా ఈమె రెండో పెళ్లి(second marriage) పట్ల విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకోగా మరికొందరు మాత్రం ఇదివరకే పెళ్లి చేసుకొని ఒక కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

పిచ్చి కుక్కల్లాగా మొరుగుతూనే ఉండండి..

Advertisement

ఈ విధంగా ఈమె రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ విమర్శల పట్ల శిరీష కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్త కొడుకుతో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ తన రెండో పెళ్లి గురించి విమర్శలు చేస్తున్న వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. “ఆనందంతో మేము ఉంటే నిద్ర లేని రాత్రులు గడుపుతూ, మా పేర్లు నెగిటివ్ కామెంట్ చేసే వారికి ,నెగెటివీటినీ స్ప్రెడ్ చేసే వారికి కంటెంట్ గా మారడం చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. పిచ్చి కుక్కల్లాగా(barking dogs) మొరుగుతూనే ఉండండి,మేము మా దారిలో మారూల్స్ తో మా జీవితాలను జీవిస్తాము. మా జీవితం మా రూల్స్ అంటూ” పోస్ట్ చేశారు.

మొదటి భర్తతో విడాకులు..

ఇలా మీరు ఎన్ని అనుకున్న మేము మాకు నచ్చినట్టుగా మా జీవితాన్ని గడుపుతాము అంటూ తనదైన శైలిలోనే విమర్శలు చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శిరీష గత కొన్ని సంవత్సరాల క్రితం నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల కారణంగానే విడిపోయారు. ఇలా నవీన్ కు విడాకులు ఇచ్చిన శిరీష ఆగస్టు 28వ తేదీ నటుడు మహేంద్రతో కలిసి ఏడు అడుగులు నడిచారు.

Advertisement

Also Read: మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×