E-Paper
Advertisement

రీ రిలీజ్ కు సిద్ధమైన రవితేజ కృష్ణ…ఆయన వల్లే కృష్ణ సాధ్యమైందన్న డైరెక్టర్?

రీ రిలీజ్ కు సిద్ధమైన రవితేజ కృష్ణ…ఆయన వల్లే కృష్ణ సాధ్యమైందన్న డైరెక్టర్?
Advertisement

Krishna Re Release: ఇటీవల కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమా ఎప్పుడు లేని విధంగా 10 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా రీ రిలీజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ (Raviteja)హీరోగా నటించిన పలు సినిమాలు విడుదల అయ్యి మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే మరో సూపర్ హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రవితేజ త్రిష(Trisha) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కృష్ణ(Krishna). 2008వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

18 సంవత్సరాల కృష్ణ..

వి వి వినాయక్(V.V.Vinayak) దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా మే 8 వ కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ వివి వినాయక్ వీడియోని విడుదల చేశారు. రవితేజ త్రిష నటించిన కృష్ణ సినిమా విడుదల 18 సంవత్సరాలు అవుతుంది అంటే నమ్మశక్యం కాలేదని తెలిపారు. ఈ సినిమా 18 సంవత్సరాలు తర్వాత తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రవితేజ నటన అద్భుతమని బ్రహ్మానందం, ఇతర ఇతర నటీనటులు ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారని వివి.వినాయక్ తెలిపారు. ఇక కృష్ణ సినిమా రాజా రవీంద్ర వల్లే సాధ్యమైంది అంటూ ఈ సందర్భంగా వినాయక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బ్రహ్మానందం కామెడీ హైలెట్..

Advertisement

ఈ సినిమా విడుదల సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని రవితేజ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాకి హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. ఇలా 2008వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులలో కూడా ఎంతో ఆత్రుత నెలకొంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ తరువాత ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

ఇరుముడి పనులలో బిజీగా రవితేజ..

Advertisement

ఇక రవితేజ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. రవితేజ చివరిగా ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఒక అరడజనుకు పైగా సినిమాలలో నటించారు. ఈ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోయాయి. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి (Irumudi) అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా సాగుతున్నాయి.

Also Read: సర్జరీ తర్వాత మొదటిసారి కనిపించిన పవన్.. అభిమానుల్లో ఆందోళన

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×