E-Paper
Advertisement

షూటింగ్‌లు బంద్.. కోలీవుడ్‌లో టెన్షన్ టెన్షన్!

షూటింగ్‌లు బంద్.. కోలీవుడ్‌లో టెన్షన్ టెన్షన్!
Advertisement

Kollywood Strike : టాలీవుడ్ రెంటల్ VS పర్సెంటేజ్ ఇష్యూతో తలపట్టేసుకుంటే కోలీవుడ్ మరో పంచాయితీతో కుదేలవుతుంది. సినిమాలు చేసేసి మీ పారితోషికాలు మీరు పట్టుకుపోతారు కాని సినిమా ప్లాప్ అయితే మాత్రం మమ్మల్ని పట్టించుకునే నాథుడే ఉండడు అంటూ సినిమా షూటింగులకు బ్రేక్ వేసింది. దీంతో సందడి సందడిగా ఉండాల్సిన కోలీవుడ్ ఇప్పుడు చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయింది.

అసలేం జరుగుతోంది? ఎందుకీ సమ్మె?

Advertisement

గత మూడేళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరోలు, టాప్ టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్లు ఆకాశాన్నంటాయి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నిర్మాత మాత్రం నిండా మునిగిపోవాల్సి వస్తోంది. ఈ దారుణ పరిస్థితిని చక్కదిద్దేందుకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘ఫిక్స్‌డ్ రెమ్యూనరేషన్’ కాదు… ‘రెవెన్యూ షేరింగ్’ విధానం అమలు చేయాల్సిందేనని పట్టుబట్టింది. అయితే నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో ప్రొడ్యూసర్స్ జరగాల్సిన షూటింగులని కాస్తా ఆపెయాల్సిన పరిస్థితి.

ఏంటి ఈ ‘రెవెన్యూ షేరింగ్’ మంత్రం?

Advertisement

ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తున్న ఈ విధానం వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే… సినిమా మొదలయ్యే ముందే అడ్వాన్స్ తీసుకోవడం ఉండదు. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో మాత్రమే హీరోలు, టెక్నీషియన్లు వాటా తీసుకోవాలి. అంటే రిస్క్ షేరింగ్ అన్నమాట.

ALSO READ :బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’కి థియేటర్ల షాక్? ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. టాలీవుడ్ కి పెద్ద గండమే!

సినిమా హిట్టయితే అందరికీ సాలిడ్ అమౌంట్ వస్తుంది. అదే డిజాస్టర్ అయితే ప్రొడ్యూసర్స్‌తో పాటు అందరూ మునగాలి. అయితే ఇది ఇప్పటికే బాలీవుడ్‌లో షారుఖ్, సల్మాన్, ఆమిర్, తెలుగులో బన్నీ, మహేష్ వంటి వారు పాటిస్తున్న సూత్రమే. మరి అందరూ ఇది ఫాలో అవుతున్నప్పుడు కోలీవుడ్ హీరోలకు వచ్చిన ప్రాబ్లం ఏంటన్నది నిర్మాతల ప్రశ్న.

నిర్మాతల ఆవేదన.. ‘చిన్న’ సినిమా బతుకుతుందా?

బడా హీరోలంతా మిగతా ఇండస్ట్రీ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ, సొంత ఇండస్ట్రీని గాలికి వదిలేస్తున్నారన్నది కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ.
పెద్ద సినిమాల బడ్జెట్‌లో 60–70 శాతం కేవలం హీరోల రెమ్యూనరేషన్‌లకే వెళ్తుంటే సినిమా మేకింగ్ క్వాలిటీ పడిపోతుందని మనసులోని మాటని బయటపెట్టేసున్నారు. దీనివల్ల చిన్న, మీడియం రేంజ్  నిర్మాతలు ఇండస్ట్రీలో నిలబడలేరన్నది వారి ఆర్గ్యుమెంట్

టోకెన్ స్ట్రైక్.. నెక్స్ట్ అడుగు ఎటు?

ఇక ఈ శనివారం జరిగిన టోకెన్ స్ట్రైక్ జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, నడిగర్ సంఘం వెంటనే చర్చలకు రాకపోతే సమ్మెను మరింత తీవ్రం చేస్తామని ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.ఒకవేళ ఈ స్ట్రైక్ సక్సెస్ అయి రెవెన్యూ షేరింగ్ విధానం అమల్లోకి వస్తే మాత్రం అది మిగతా ఇండస్ట్రీలోకి పాకే అవకాశమే ఎక్కువ

చూడాలి మరి… ఈ సమ్మెకు కోలీవుడ్ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో. ఏది ఏమైనా నిర్మాతలు బాగుంటేనే సినిమా పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది అనే విషయం ఇప్పటికైనా వారికి  అర్థమవుతుందో లేదో!

ALSO READ :హీరోయిన్ మోనాలిసా సంచలనం.. నాపై 10 సార్లు లైంగిక దాడి.. డైరెక్టర్‌పై పోక్సో కేసు!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×