Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కళ్యాణ్(Pawan Kalyan) గత కొంతకాలంగా సైనస్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఈయన గత 15 రోజుల క్రితం సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ కు సర్జరీ నిర్వహించారు. సర్జరీ అనంతరం రెండు వారాలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ సర్జరీ కారణంగా ఈయన రాజకీయ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్న సందతి తెలిసిందే.
ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసారు. పవన్ కళ్యాణ్ సర్జరీ తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారి పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ యోగక్షేమాలు గురించి అడిగి తెలుసుకున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సర్జరీ జరిగి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఈయన పూర్తిగా కోలుకోలేదని ఇంకా నీరసంగానే కనిపిస్తున్నారు అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు కూడా తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో ఎలాంటి కొత్త సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదు. ఈయన ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలు అన్నింటిని పూర్తి చేసి విడుదల చేశారు.
నిరాశపరిచిన ఉస్తాద్ భగత్ సింగ్..
పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే . ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పలువురు దర్శకులతో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా అధికారకంగా ప్రకటించలేదు. మరి పవన్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో ఉండబోతోందనే వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్ వంటి తదితరులు పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలిపారు.
Also Read: జననాయగన్ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్న అమెజాన్..మరో సమస్థ చేతికి ఓటీటీ రైట్స్!