E-Paper
Advertisement

ఆయన క్రమశిక్షణే మాకు స్ఫూర్తి.. చౌదరి మృతిపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి.

ఆయన క్రమశిక్షణే మాకు స్ఫూర్తి.. చౌదరి మృతిపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి.
Advertisement

RB Choudary : సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి అకస్మాత్తుగా చనిపోవడం అటు కోలీవుడ్ ని , ఇటు టాలీవుడ్ ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తెలుగు, తమిళ బాషలలో ఎంతో మందిని తన బ్యానర్ ద్వారా పరిచయం చేసి,ఎన్నో మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అందించిన ఆయన ఇక లేరు అని తెలీడంతో తెలుగు తమిళ సినీ ప్రముఖులు తమ తమ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు .

ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి, ర‌జ‌నీ కాంత్‌, వెంక‌టేశ్‌, నాగార్జున‌, క‌మ‌ల్ హ‌స‌న్‌, విశాల్‌, అనీల్ రావిపూడి, బండ్ల గ‌ణేశ్, తేజ స‌జ్జా వంటి సెట‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం తెలిపి సానుభూతి వ్య‌క్తం చేశారు.

Advertisement

 

Advertisement

ఆర్.బి. చౌదరి గారి మరణవార్త వినడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయనతో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ ద్వారా నా ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయంలో ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఊహించని నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆ దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. – చిరంజీవి

నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆర్.బి. చౌదరి గారు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది నటులకు, సాంకేతిక నిపుణులకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన క్రమశిక్షణ, నిర్మాతల పట్ల ఆయనకున్న నిబద్ధత ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – ఖుష్బూ సుందర్

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత ఆర్ బి చౌదరి గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను – పవన్ కళ్యాణ్

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×