E-Paper
Advertisement

ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని ముప్పై ఏళ్ళ క్రితం సినిమాలు… ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూసేంతగా

ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని ముప్పై ఏళ్ళ క్రితం సినిమాలు… ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూసేంతగా
Advertisement

Best 1996 Movies on OTT: 1996వ సంవత్సరం హాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక అద్భుతం. అప్పట్లో వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. దాదాపు 30 ఏళ్లు గడిచినా, ఆ కథల్లోని దమ్ము, నటీనటుల పర్ఫార్మెన్స్ నేటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉన్నాయి. వీటిలో థ్రిల్లర్ల నుంచి ప్రేమకథల దాకా ఉన్నాయి. ఒక్క సారి వీటిని చూస్తే మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఆ సినిమాల ఏ ఓటీటీలో దొరుకుతాయో ఒకసారి చూద్దాం.

1. లోన్ స్టార్ (Lone Star)

ఇదొక గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ. టెక్సాస్ సరిహద్దులో దొరికిన ఒక అస్థిపంజరం చుట్టూ తిరిగే ఈ కథ. గతాన్ని న్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తుంటే ఎన్నో నిజాలు బయటపడతాయి. స్లోగా సాగినా కథలో మాత్రం మంచి దమ్ముంటుంది. నేటికీ ఇలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాలు రావడం అరుదు. దీనిని మీరు Amazon Prime Videoలో చూడవచ్చు.

2. జెర్రీ మాగైర్ (Jerry Maguire)

Advertisement

టామ్ క్రూజ్ కెరీర్‌లోనే ఇదొక స్పెషల్ మూవీ. టామ్ క్రూజ్ నటన, ఆ ఎమోషన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. ఇది ఒక స్పోర్ట్స్ ఏజెంట్ తన నైతిక విలువల కోసం చేసే పోరాటం. అంతేకాదు అందులోని ప్రేమకథ కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. ఇది ప్రస్తుతం SonyLIV, Amazon Prime Video (రెంటల్) లో అందుబాటులో ఉంది.

3. ది ఇంగ్లీష్ పేషెంట్ (The English Patient)

ఇది రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక విషాదకరమైన ప్రేమకథ. ఈ సినిమా ఏకంగా 9 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తాయి. ఇది Apple TV, Amazon Prime లో రెంటల్ పద్ధతిలో దొరుకుతుంది.

4. ట్రైన్‌స్పాటింగ్ (Trainspotting)

Advertisement

యువత దారి తప్పితే ఎలా ఉంటుంది, డ్రగ్స్ కి బానిసలైన వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయి అనేది ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ విజువల్స్, మ్యూజిక్ ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఇది Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

5. ప్రైమల్ ఫియర్ (Primal Fear)

ఇందులో ఎడ్వర్డ్ నార్టన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక లాయర్, ఒక హత్య కేసులో చిక్కుకున్న అబ్బాయిని ఎలా కాపాడాడనేదే కథ. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇది ప్రస్తుతం Netflix, Amazon Prime Video లో ఉంది.

6. రోమియో + జూలియట్ (Romeo + Juliet)

షేక్స్పియర్ క్లాసిక్ ప్రేమకథను ఆధునిక స్టైల్‌లో చూపించిన చిత్రమిది. లియోనార్డో డికాప్రియో క్రేజ్ ఈ సినిమాతో ఆకాశానికి చేరింది. ఒక్క సారి చూస్తే తనివి తీరే సినిమా కాదిది. ఇది Jio Hotstar లో అందుబాటులో ఉంది.

7. ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ (The People vs. Larry Flynt)

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక బోల్డ్ పాయింట్ చెప్పిన సినిమా ఇది. లారీ ఫ్లింట్ అనే మ్యాగజైన్ పబ్లిషర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలోని కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి చేసిన పోరాటమే ఈ సినిమా. ఇది Apple TV లో రెంటల్ కి అందుబాటులో ఉంది. ఈ సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, జీవితంలోని రకరకాల కోణాలను మనకు పరిచయం చేస్తాయి. అందుకే 30 ఏళ్లయినా వీటి క్రేజ్ తగ్గలేదు. వీకెండ్‌లో ఏదైనా మంచి సినిమా చూడాలనుకుంటే, ఈ లిస్ట్‌లో ఒకటి పక్కాగా ట్రై చేయండి.

Read Also : టైం ట్రావెల్ చేసి కిల్లర్ చేతిలో బుక్కయ్యే అమ్మాయి… కొరివితే తల గోక్కోవడం అంటే ఇదే మరి

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×